జాతీయ వార్తలు

ఏపికి హోదా అమలుచేయాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: కేంద్ర ప్రభుత్వం విషయంలో కొన్ని అంశాల్లో అసంతృప్తి ఉన్నట్టు టిడిపి పార్లమెంటరీ పార్టీ నాయకుడు, కేంద్రమంత్రి సుజనా చౌదరి వెల్లడించారు.
పార్లమెంట్‌లో అనసరించాల్సిన వ్యూహంపై చర్చించడానికి బుధవారం ఏపి భవన్‌లో టిడిపి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. సమావేశం తరువాత సుజనా చౌదరి విలేఖరులతో మాట్లాడుతూ విభజన సమయంలో రాజ్యసభలో అప్పటి ప్రధాని మాన్మోహన్ సింగ్ ప్రకటించిన ప్రత్యేక హోదా, హామీలను కేంద్రం అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక హోదాపై కెవిపి ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు టిడిపి మద్దతు ఇస్తుందని పునరుద్ఘాటించారు. ఈ బిల్లు విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తోందని సుజన ఆరోపించారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలు అర్ధరహితమని అన్నారు. వీరప్ప మొయిలీ లాంటి నాయకులు ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వొద్దని పార్లమెంట్‌లో అభ్యంతరం వ్యక్తం చేశారని గుర్తుచేశారు. కేంద్రం నుంచి ఎపికి ఎలాంటి సాయం అందిందో పూర్తి వివరాలు రాజ్యసభలో చర్చిస్తామని ఆయన వెల్లడించారు. రాష్ట్రానికి రావాల్సిన సాయంపై త్వరలో బ్యాలెన్స్ షీట్ వివరాలను విడుదల చేస్తామని సుజనాచౌదరి తెలిపారు. రాష్ట్రానికి చేసిన సాయంపై కేంద్ర ఆర్థిక, హోంశాఖ మంత్రి ప్రకటన చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కాగా రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యంగా టిడిపి పని చేస్తోందని ఆయన చెప్పారు. తాము మాత్రం బిజెపితో మిత్ర ధర్మం పాటిస్తున్నట్టు మంత్రి స్పష్టం చేశారు.

న్యూఢిల్లీలోని ఏపి భవన్‌లో బుధవారం జరిగిన టిడిపి పార్లమెంటరీ
పార్టీ సమావేశంలో మాట్లాడుతున్న ఎంపీలు