జాతీయ వార్తలు

విజన్ డాక్యుమెంట్‌పై నేడు నీతి ఆయోగ్ భేటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 27: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ఇక్కడ జరుగనున్న నీతి ఆయోగ్ సమావేశానికి అధ్యక్షత వహించనున్నారు. దేశ సమగ్రాభివృద్ధిని వేగవంతం చేయడానికి 15 ఏళ్ల విజన్ డాక్యుమెంట్‌కు పటిష్ఠమైన రూపాన్ని ఇవ్వడానికి ఈ సమావేశం జరుగుతోంది. ‘ఈ సమావేశంలో నీతి ఆయోగ్.. విజన్ డాక్యుమెంట్‌పై ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని ప్రధానమంత్రికి వివరిస్తుంది’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. నీతి ఆయోగ్ పర్యవేక్షణలో కొనసాగుతున్న వివిధ ప్రభుత్వ పథకాల పురోగతిని, ఆర్థిక పరిస్థితిని కూడా నీతి ఆయోగ్ చైర్మన్ అయిన మోదీ ఈ సమావేశంలో సమీక్షించనున్నారు.

ఈ సమావేశంలో నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, ఇతర సభ్యులు పాల్గొంటారు. దేశంలో పేదరిక నిర్మూలన, వ్యవసాయ రంగ భవిష్యత్తు అభివృద్ధిపై ఏర్పాటు చేసిన రెండు టాస్క్ఫోర్స్‌లు శుక్రవారంనాటి సమావేశంలో తమ నివేదికలను సమర్పిస్తాయి. ఈ రెండు కమిటీలను నిరుడు ఫిబ్రవరి 8న జరిగిన నీతి ఆయోగ్ తొలి సమావేశంలో ఏర్పాటు చేశారు.