జాతీయ వార్తలు

బిచ్చమెత్తడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ మంత్రి సుజనా చౌదరి (టిడిపి) మాజీ ప్రధాన మంత్రి ఇందిరా గాంధీపై ప్రశంసల వర్షం కురిపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన చట్టంలో ఇచ్చిన హామీల అమలుపై శుక్రవారం రాజ్యసభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొంటూ, వంద సంవత్సరాల వరకు రాష్ట్ర విభజన చేపట్టకూడదని స్పష్టమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో పాటు ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసేందుకు ససేమిరా అన్న ఇందిరా గాంధీ ఎంతో గొప్ప నాయకురాలని కొనియాడారు. రాష్ట్ర విభజనకు కాంగ్రెస్‌తో పాటు బిజెపి కూడా సమాన బాధ్యత వహించాలని ఆయన పేర్కొంటూ, ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ ప్రసంగానికి పలుమార్లు అడ్డుపడ్డారు. రాష్ట్రాన్ని విభజించినందుకు కాంగ్రెస్ అధికారాన్ని కోల్పోయి తగు మూల్యం చెల్లించుకుందని, బిజెపికి కూడా ఇదే గతి పడుతుందని పరోక్షంగా హెచ్చరించారు. విభజన చట్టంలో ఏపికి ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో చేసిన వాగ్దానాన్ని నెరవేర్చాలని ఆయన మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ప్రత్యేక హోదా అంశాన్ని చట్టంలో చేర్చనందున దానిని అమలు చేయలేమని చెప్పటం అర్థరహితమన్నారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాము తప్ప బిచ్చమెత్తటం లేదని ఆయన స్పష్టం చేశారు.
దేశం గత 65 సంవత్సరాల పాటు కాంగ్రెస్ పాలనలో కుళ్లిపోయిందని, ప్రస్తుత ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ దేశ పరిస్థితులను బాగుపరిచేందుకు ప్రయత్నిస్తున్నారని సుజనా చౌదరి చెప్పారు. ఈ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్, పార్టీ రాజ్యసభా పక్ష ఉపనాయకుడు ఆనంద్ శర్మ తీవ్రంగా ఖండించారు. రాజ్యసభ ఉపాధ్యక్షుడు పి.జె.కురియన్ కూడా సుజనా చౌదరి వ్యాఖ్యల పట్ల విస్మయన్ని వ్యక్తం చేశారు. ఒక మంత్రి ఇలా మాట్లాడటం మంచిది కాదని హితవు చెప్పారు. జైట్లీ సమాధానం చెబుతున్నప్పుడు సుజనా చౌదరి పలుమార్లు అడ్డుపడటాన్ని కూడా కురియన్ తప్పుబట్టారు.
శే్వతపత్రానికి సిఎం రమేష్ డిమాండ్
కాగా, విభజన చట్టం హామీల అమలుపై గురువారం రాజ్యసభలో చర్చ సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఇచ్చిన సమాధానం తమకు ఎంత మాత్రం నచ్చలేదని టిడిపి సభ్యుడు సి.ఎం.రమేష్ చెప్పారు. విభజన చట్టం హామీల అమలుపై ప్రభుత్వం శే్వతపత్రాన్ని విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేయగా, రాష్ట్ర విభజన విజయవంతమైందని, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్నాయని కాంగ్రెస్ సభ్యుడు ఆనంద భాస్కర్ చెప్పారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వలేని పక్షంలో ఏదోఒక హోదా ఇవ్వాలని ఆయన సూచించారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని 2014లో యుపిఏ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయం ఏమైందని ఆనంద్ భాస్కర్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నారని టిడిపి సభ్యురాలు సీతామహాలక్ష్మి తెలిపారు. ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వాలని కాంగ్రెస్ సభ్యుడు ఎం.ఏ.ఖాన్ డిమాండ్ చేశారు. ఏపికి పది సంవత్సరాల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఎ.వెంకయ్యనాయుడు డిమాండ్ ఏమైందని ఆయన నిలదీశారు. తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఖాన్ ఆరోపించారు.