జాతీయ వార్తలు

పాక్‌తో చర్చలులేవు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 29: పాకిస్తాన్‌లో వచ్చే నెల 4వ తేదీన జరిగే సార్క్ దేశాల మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌కు వెళ్లనున్నారు. అయితే ఈ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్‌కు, పాకిస్తాన్ నాయకులకు మధ్య ఎటువంటి ద్వైపాక్షిక సమవేశం ఉండదని విదేశీ వ్యవహారాల శాఖ (ఎంఇఎ) అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ శుక్రవారం స్పష్టం చేశారు. పాక్ పర్యటన సందర్భంగా రాజ్‌నాథ్ ఆ దేశ హోం శాఖ మంత్రి చౌదరి నిసార్ అలీ ఖాన్‌తో పాటు ప్రధాన మంత్రి నవాజ్ షరీఫ్‌తో ద్వైపాక్షిక సమావేశాలు జరుపుతారని హోం మంత్రిత్వ శాఖకు చెందిన ఒక అధికారిని ఉటంకిస్తూ వార్తలు వెలువడిన నేపథ్యంలో వికాస్ స్వరూప్ ట్విట్టర్ ద్వారా పై విషయాన్ని వెల్లడించారు. సార్క్ సమావేశంలో పాల్గొనేందుకు మాత్రమే రాజ్‌నాథ్ సింగ్ పాకిస్తాన్‌కు వెళ్తున్నారని, ఈ పర్యటన సందర్భంగా ఎటువంటి ద్వైపాక్షిక సమావేశాలు ఉండబోవని వికాస్ స్వరూప్ గురువారమే తేల్చి చెప్పారు. అయితే భారత్‌లో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద చర్యలకు అడ్డుకట్ట వేయాలని, అలాగే పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రవాద దాడి కేసు దర్యాప్తును, ముంబయి ఉగ్రవాద దాడుల కేసు విచారణను వేగవంతం చేయాలని రాజ్‌నాథ్ ఈ పర్యటన సందర్భంగా పాక్ నాయకులను కోరుతారని హోం మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి.
పాక్‌కు బుద్ధి చెప్పాలి : బిజెపి ఎంపీ
ఇదిలావుంటే, పాకిస్తాన్‌తో చర్చలు జరపాల్సిన అవసరం లేదని, మన దేశంలో ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న పాక్‌కు గట్టిగా బుద్ధి చెప్పాలని కేంద్ర హోం శాఖ మాజీ కార్యదర్శి, బిజెపి ఎంపీ ఆర్.కె.సింగ్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. ఇటీవల పఠాన్‌కోట్ వైమానిక స్థావరంతో పాటు కాశ్మీరులో జరిగిన ఉగ్రవాద దాడుల్లో పాక్ సైనికదళ ప్రమేయం ఉందని, ఈ దాడులకు పాల్పడిన ఉగ్రవాదులకు పాకిస్తాన్‌లో శిక్షణ ఇచ్చి మన దేశానికి పంపారని ఆయన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.