జాతీయ వార్తలు

జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీఎస్ మార్చ్‌పాస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీస్ తలపెట్టిన నిరసన కార్యక్రమాలు 12వ రోజుకు చేరుకోన్నాయి. ఢిల్లీ జంతర్ మంతర్‌లో ఆదివారం నాడు మందకృష్ణ మాదిగ అధ్వర్యంలో ఎమ్మార్పీస్ మార్చ్‌పాస్ట్ నిర్వహించింది. వందలాదిగా హాజరైన యువకులు నీలరంగు టీషర్ట్‌లు ధరించి జంతర్‌మంతర్‌ను పరేడ్ గ్రౌండ్‌గా మార్చారు. అనంతరం ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాట్లాడుతూ వర్గీకరణ అడ్డుకోవడానికి ఎన్ని అధర్మ పద్ధతులన్నాయో అన్నింటినీ అవలంబిస్తున్నారని, అలాంటి స్వార్థపరులు పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించారు. యుపిఏ హయాంలో ఉషామెహ్రా కమీషన్ నివేదిక సమర్పించిన తరువాత వర్గీకరణ చేసేందుకు ఆ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమయిన తరుణంలో కొందరు స్వార్థపరులు చివరి నిమిషంలో సైంధవుల్లా అడ్డుకొన్నారని ఆరోపించారు. ఎమ్మార్పీస్ తలపెట్టిన నిరసన కార్యక్రమానికి సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి మద్దతు తెలిపారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజ్యసభలో లేవనెత్తి కేంద్రంపై ఒత్తిడి తెస్తామని అన్నారు. ఎస్సీ వర్గీకరణకు తమ పార్టీ ఎమ్మార్పీస్‌తో కలిసి పోరాటం చేస్తుందని వెల్లడించారు.