జాతీయ వార్తలు

రైల్వే సిబ్బందికి కొత్త యూనిఫామ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 31: దేశవ్యాప్తంగా అయిదు లక్షల మంది రైల్వే ఉద్యోగులు, టిటిఇలు, గార్డులు, డ్రైవర్లకు భారత రైల్వేలు కొత్త డ్రస్‌కోడ్‌ను అమలు చేయబోతోంది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రీతూబేరి ఈ యూనిఫామ్‌ను రూపొందిస్తున్నారు. భారత సంస్కృతిని ప్రతిబింబించే థీమ్‌వర్క్‌తో ఈ డ్రస్‌లను తయారుచేస్తారు. దీనికి సంబంధించి నాలుగు సెట్ల డిజైన్ వర్క్‌లను రైల్వే శాఖకు రీతూబేరి అయిదురోజుల క్రితమే సమర్పించారు. ఈ నాలుగింటిలో ఒకదాన్ని ఎంపిక చేసే బాధ్యతను రైల్వే శాఖ ప్రజలకే అప్పగించింది. రైల్వే శాఖ వెబ్‌సైట్‌లో, ట్విట్టర్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో ఈ డిజైన్లను ప్రజల ముందుంచింది. భారతీయ రైల్వేలలోని మొత్తం 13లక్షల ఉద్యోగుల్లో 5లక్షల మందికి ఈ డ్రస్‌కోడ్ వర్తిస్తుంది. ‘‘ఈ యూనిఫామ్ ఆధునిక భారత దేశ ముఖచిత్రాన్ని, సంప్రదాయ సంస్కృతులను ప్రతిబింబిస్తుందని’’ రీతూబేరీ తెలిపారు.