జాతీయ వార్తలు

అరుణాచల్‌ప్రదేశ్‌లో అస్థిరతకు కుట్ర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 16: అరుణాచల్ ప్రదేశ్‌లో ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, పథకం ప్రకారమే ఇదంతా చేస్తోందని కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ అసమ్మతి ఎమ్మెల్యేలను కూడగట్టేందుకు బిజెపి అగ్రనాయకత్వం తీవ్రంగా ప్రయత్నిస్తోందని, గవర్నర్ జ్యోతిప్రసాద్ రాజ్‌ఖోవా చర్యలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వాన్ని కూలదోసేందుకు ఒక పథకం ప్రకారం కుట్ర జరుగుతోందని, ఇందులో కేంద్ర ప్రభుత్వ పెద్దల పాత్ర కూడా ఉందని తెలిపారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియా సారథ్యంలోని బృందం బుధవారం రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీని కలిసి తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ బృందంలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, సీనియర్ నాయకులు ఎ.కె.ఆంటోనీ, మల్లికార్జున్ ఖర్గే, గులాం నబీ ఆజాద్, ఆనంద్ శర్మ, అహ్మద్ పటేల్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఒక మెమొరాండం సమర్పించారు. రాజ్యాంగ పవిత్రతను, ప్రజాస్వామ్య సంప్రదాయాన్ని పరిరక్షించాలని కోరారు. అరుణాచల్ జరుగుతున్న పరిణామాలకు సంబంధించి గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించేలా ఆదేశించాలని వారు ప్రణబ్‌ను కోరారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా గవర్నర్ జ్యోతి ప్రసాద్ రాజ్‌ఖోవా వ్యవహరిస్తున్నారని, కేంద్ర ప్రభుత్వ ఏజెంట్‌గా పనిచేస్తున్నారని రాష్టప్రతిని కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ సోనియా ఆరోపించారు. గవర్నర్ చర్యలతో రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం తలెత్తే ప్రమాదం ఉందని ఆరోపించారు.

చిత్రం... రాష్టప్రతి ప్రణబ్‌ను కలిసి వినతిపత్రం అందజేస్తున్న కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ. చిత్రంలో మన్మోహన్ సింగ్, రాహుల్, ఆంటోనీ