జాతీయ వార్తలు

ముంబయిలో కుండపోత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి/్థనె, జూలై 31: మహారాష్టల్రోని ముంబయి మహానగరం, దానికి ఆనుకుని ఉన్న థానె, పాల్‌ఘర్ జిల్లాల్లో ఆదివారం ఎడతెరిపిలేకుండా కురిసిన భారీ వర్షాలకు జన జీవనం అస్తవ్యస్తమయింది. థానె జిల్లాలోని భివాండి పట్టణంలో కుండపోత వర్షాలకు ఓ నివాస భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది చనిపోగా, మరో పదిమంది గాయపడ్డారు. ముంబయిలో భారీ వర్షాల కారణంగా నగరంలో రోజువారీ ప్రయాణికులకు జీవనాడిగా భావించే సబర్బన్ రైలు సర్వీసులకు తీవ్ర అంతరాయమేర్పడంది. అయితే ఆదివారం సెలవు రోజు కావడంతో దీని ప్రభావం తక్కువగా కనిపించింది. భారీ వర్షాలకు థానె జిల్లాలోని భివాండీ పట్టణంలో ఓ నివాస భవనం కూలిపోవడంతో ముగ్గురు మహిళలు, నలుగురు పిల్లలు సహా 9 మంది చనిపోగా, మరో పది మంది గాయపడ్డారు. శాంతినగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గైబి నగర్‌లో ఉండే ఈ రెండంతస్థుల భవనంలో ఏడెనిమిది కుటుంబాలు కాపురం ఉన్నాయని, ఉదయం తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో ఇది కూలిపోయిందని భివాండీ తహసీల్దార్ వైశాలి లాంబాటే చెప్పారు. చనిపోయినవారిలో ఒక మహిళ, ఆమె నలుగురు కుమారులు ఉన్నారు. ఇదికాక థానెలోని ఘోడ్‌బందర్ రోడ్డులో భారీ వర్షాలకు ఓ నాలా పొంగి ప్రవహించడంతో ఓ హౌసింగ్ కాంప్లెక్స్ వెనక ఉన్న పర్యాటక ప్రదేశంలో ముగ్గురు పిల్లలు, ఇద్దరు మహిళలు సహా 12 మంది చిక్కుపడి కనిపించడంతో విపత్తుల నిర్వహణ బృందాలకు అత్యవసర సందేశాలను పంపించడంతో వారిని తాళ్లు, నిచ్చెనల సాయంతో కాపాడారు. థానె నగరంలో అనేకచోట్ల భారీ వర్షాలకు నాలాలు పొంగిపోవడం, చెట్లు విరిగి పడ్డం, నీళ్లు నిలిచిపోవడానికి సంబంధించి అగ్నిమాపక సిబ్బందికి, డిజాస్టర్ మేనేజిమెంట్ విభాగానికి అనేక ఫోన్‌కాల్స్ రావడంతో వారికి క్షణం తీరికలేకుండా పోయింది. కాగా, రాబోయే 24 గంటల్లో ముంబయి, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీనుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది. థానె నగరంలో 24 గంటల వ్యవధిలో 175 మి.మీ. వర్షం కురిసింది. దీంతో బైటికి వెళ్లవద్దని ప్రజలను హెచ్చరిస్తూ నగర మున్సిపల్ కమిషనర్ సంజీవ్ జైశ్వాల్ ఒక ప్రకటన జారీ చేశారు.

భివాండీలో కూలిన భవనం వద్ద సహాయక చర్యలు చేపడుతున్న సిబ్బంది. భారీ వర్షాలకు నీట మునిగిన థానె రైల్వే స్టేషన్