జాతీయ వార్తలు

కాశ్మీర్‌లో హక్కుల ఉల్లంఘన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్, ఆగస్టు 2:కాశ్మీర్ అల్లర్లకు సంబంధించి భారత్‌ను మరింతగా కవ్వించే చర్యకు పాకిస్తాన్ పాల్పడింది. కాశ్మీర్‌లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, దీనిపై దర్యాప్తు చేయడానికి నిజ నిర్థారణ సంఘాన్ని పంపాలని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ను డిమాండ్ చేస్తూ మంగళవారం ఏకగ్రీవంగా ఓ తీర్మానాన్ని పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదించింది. అంతే కాదు కాశ్మీర్ ప్రజలకు పూర్తి స్థాయి మద్దతును అందిస్తున్నామని కూడా ప్రకటించింది. భారత భద్రతా దళాలు అమాయక కాశ్మీరీలపై తీవ్రస్థాయిలో దాడులకు పాల్పడుతున్నారని..ఆ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామంటూ ఆ తీర్మానంలో పాక్ పార్లమెంట్ స్పష్టం చేసింది. కాశ్మీరీలపై ఉపయోగించిన తూటాలు అంతర్జాతీయ మానవత్వ చట్టాలకు విరుద్ధమని కూడా ఆ తీర్మానంలో పేర్కొంది.
ఇలాంటి విఘాతక చర్యలకు ఎంతగా భారత్ పాల్పడ్డా స్వయం నిర్ణయాధికారాన్ని సాధించుకోవాలన్న కాశ్మీరీ ప్రజల మనోనిబ్బరం నీరుగారీ పోదన్న ధీమానూ పాక్ పార్లమెంట్ వ్యక్తం చేసింది. అలాగే కాశ్మీర్ ప్రజలు సాగిస్తున్న పోరాటానికి రాజకీయంగా, నైతికంగా, దౌత్యపరంగా కూడా పూర్తిస్థాయి మద్దతును అందిస్తున్నామని తెలిపింది.