జాతీయ వార్తలు

ఆత్మహత్యే శరణ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో తల్లీ కూతుళ్లపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన వారిని మూడు నెలల్లోగా శిక్షించని పక్షంలో తామంతా ఆత్మహత్య చేసుకుంటామని వారి కుటుంబ సభ్యులు హెచ్చరించారు. ‘మమ్మల్ని దోచుకున్నారు.. చావకొట్టారు. వాళ్లు నా కూతుర్ని ఏం చేశారో అందరికీ తెలుసు.. వాళ్లను నా భార్య, కూతురే శిక్షించాలనేది నా కోరిక. మూడు నెలల్లోపల దుండగులను శిక్షించని పక్షంలో మేము ముగ్గురమూ ఆత్మహత్య చేసుకుంటాం’ అని క్యాబ్ డ్రైవరయిన బాలిక తండ్రి చెప్పాడు. గత శుక్రవారం రాత్రి నోయిడానుంచి షాజహాన్‌పూర్‌కు కారులో వెళ్తున్న కుటుంబంపై బులంద్‌శహర్ వద్ద దోపిడీ దొంగలు దాడిచేసి వారిని దోచుకోవడమే కాకుండా మగవాళ్లను తాళ్లతో కట్టేసి తల్లిపై, ఆమె 13 ఏళ్ల కూతురిపై దారుణంగా సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ‘దాడి చేసినవాళ్లు ఏడెనిమిదిమంది ఉన్నారు. వాళ్లు మా కాళ్లు, చేతులు కట్టేసి చితకబాదారు. మేము నీళ్లు అడిగినా, చివరికి కదిలినా సరే కొడుతూనే వచ్చారు’ అని 39 ఏళ్ల అతను చెప్పాడు. పోలీసు కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేసినా తమకు ఎలాంటి సహాయం లభించలేదని అతను ఆరోపించారు.
దోపిడీ దొంగలకోసం పెద్దఎత్తున గాలింపు చేపట్టిన ఉత్తరప్రదేశ్ పోలీసులు సోమవారం ముగ్గురు నిందితులు- నరేశ్ (25), బబ్లూ (22) రైస్ (28)లను అరెస్టు చేయడంతోపాటు మరో డజను మందిని అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటనపై ప్రతిపక్షాలతోపాటు అన్ని వర్గాలనుంచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం కావడంతో రాష్ట్ర ప్రభుత్వం విధి నిర్వహణలో అలసత్వం ప్రదర్శించినందుకు జిల్లా ఎస్‌ఎస్‌పి వైభవ్ కృష్ణతో సహా అయిదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేసింది.
ఇదిలా ఉండగా మైనర్ బాలికకు వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ ఆమె పట్ల అమర్యాదగా ప్రవర్తించాడని విమర్శలు రావడంతో జాతీయ మహిళా కమిషన్ ఆ డాక్టర్‌కు సమన్లు జారీ చేసూత, ఎఫ్‌ఐఆర్‌లో చిన్నారులపై లైంగిక దాడుల రక్షణ చట్టం (పిఓసిఎస్‌ఓ) నిబంధనలను చేర్చకపోవడంపై పోలీసులను తీవ్రంగా తప్పుబట్టింది.

ప్రతిపక్షాల కుట్రేమో!
లక్నో: రేప్ సంఘటన ప్రభుత్వంపై ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అయి ఉండవచ్చంటూ ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీశాయి. ‘ఓట్లకోసం జనం ఎంతకైనా తెగిస్తున్నారు. గుజరాత్, ముజఫర్‌నగర్, షామ్లి, కైరానాలాంటి సంఘటనలు జరిగినప్పుడు ఇది మాత్రం ఎందుకు జరగకూడదు. దీనివెనక వాస్తవం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం’ అని ఆజంఖాన్ సోమవారం రాంపూర్‌లో అన్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో రాజకీయ పార్టీలు ఆయన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డాయి. ఆజంఖాన్‌కు మతి భ్రమించినట్లుందని, అందుకే ఇంతగా దిగజారి మాట్లాడుతున్నారని బిజెపి దుయ్యబట్టింది. గతంలో చాలా అంశాలపై రాజకీయాలు చేసిన ఆజంఖాన్ ఇప్పుడు గ్యాంగ్‌రేప్‌పై రాజకీయం చేస్తున్నారు. ఇది సిగ్గుచేటు’ అని ఉత్తరప్రదేశ్ బిజెపి అధ్యక్షుడు కెపి వౌర్య అన్నారు. అంతేకాదు ఈ సంఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు.