అంతర్జాతీయం

బలవంతపు మార్పిళ్లను హిందుత్వ అంగీకరించదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 3: హిందూ సంప్రదాయం బలవంతపు మత మార్పిళ్లను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించదని, వ్య క్తుల మానవ హక్కులను హరించే విధంగా మార్పిళ్లను ఒప్పుకోదని రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘ్ చాలక్ మోహన్ భాగవత్ అన్నారు. ‘‘హిందూయిజం ఒక మతం కాదు. ఒక సంప్రదాయం. ఈ సంప్రదాయం ప్రతి ఒక్కరికీ స్వాతంత్య్రాన్నిచ్చింది. మతం, విశ్వాసం అనేది వ్యక్తిగతమైంది. వారి ఇష్టానుసారం ఇష్టమైన ధర్మాన్ని అనుసరించవచ్చు. అంతేకానీ వ్యక్తుల హక్కులను కాలరాస్తూ, ఇతర మార్గాల్లో జరిగే మత మార్పిళ్లను అంగీకరించే ప్రసక్తే లేదు’’ అని భాగవత్ స్పష్టం చేశారు. ‘‘ఐడెంటిటీ ఇంటిగ్రేషన్’’ అన్న అంశంపై జరిగిన సదస్సులో ఆయన ప్రసంగించారు. యునైటెడ్ కింగ్‌డమ్‌లోని స్వయంసేవక్ సంఘ్ 50 ఏళ్ల వార్షికోత్సవాలలో ఆయన పాల్గొన్నారు. ‘హిందూ ఒక సంస్కృతి, హిందూ ఒక సంప్రదాయం.. హిందూ ఒక ధర్మం’ అని ఆయన అన్నారు. ‘మాకు ఇతర అస్తిత్వాలతో ఎలాంటి సమస్యా లేదు. మనం ఒక సమైక్య సమాజంలో జీవిస్తున్నాం. ప్రపంచంలో ఎక్కడ హిందూ సమాజం ఉన్నా.. అది అనే మాట ఒక్కటే - భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రోత్సహించటం’ అని ఆయన అన్నారు.