అంతర్జాతీయం

రన్‌వేను ఢీకొన్న విమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయి, ఆగస్టు 3: కేరళలోని తిరువనంతపురంనుంచి దుబాయి వస్తున్న ఎమిరేట్స్ విమానానికి బుధవారం పెను ప్రమాదం తప్పింది. 282 మంది ప్రయాణికులు, 18మంది సిబ్బంది మొత్తం 300 మందితో తిరువనంతపురం నుంచి దుబాయి వస్తున్న ఈ విమానం దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్ అయింది. ఆ వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగాయి. ఈ బోయింగ్ 777-300 విమానంలో 226 మంది భారతీయులున్నట్లు ఎయిర్‌లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని, ప్రయాణికులను, సిబ్బందిని సురక్షితంగా కాపాడినట్లు ఎయిర్‌లైన్స్ ఆ ప్రకటనలో తెలిపింది.
ఉదయం 10 గంటల 19 నిమిషాలకు త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలో బయలుదేరిన ఈ విమానం దుబాయి ఎయిర్‌పోర్టులో మధ్యాహ్నం 12.50 నిమిషాలకు దిగాల్సి ఉంది. మొత్తం 282 మంది ప్రయాణికుల్లో ఏడుగురు చిన్న పిల్లలున్నట్లు తిరువనంతపురం ఎయిర్‌పోర్టు డైరెక్టర్ జార్జి తరక్కన్ చెప్పారు. విమానంలో ఇద్దరు భారతీయ సిబ్బంది ఉన్నారని ఆయన చెప్పారు. విమానంలో మొత్తం 74 మంది విదేశీ ప్రయాణికులున్నారని ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా ఎమిరేట్స్ విమాన ప్రమాదం తర్వాత దుబాయి ఎయిర్‌పోర్టు అధికారులు అన్ని కార్యకలాపాలను నిలిపివేశారు. దుబాయి విమానాశ్రయంలోని ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు మంటలను పూర్తిగా ఆర్పివేశాయని, ప్రయాణికులు, సిబ్బంది అందరినీ క్షేమంగా బయటికి తీసుకు రావడం జరగిందని ప్రమాదం తర్వాత దుబాయి ఎయిర్‌పోర్టు మీడియా కార్యాలయం ఒక ట్వీట్‌లో తెలియజేసింది. కాగా, విమానంలో ప్రయాణిస్తున్న వారిలో ఎక్కువ మంది కేరళకు చెందిన వారేనని సాయి భాస్కర్ అనే ప్రయాణికుడు చెప్పారు. విమానం ప్రయాణించిన సమయంలో ఎలాంటి సమస్యా తలెత్తలేదని, సాంకేతిక లోపానికి సంబంధించి ఎలాంటి అనౌన్స్‌మెంట్ కూడా లేదని ఆయన చెప్పారు. మొదట విమానం మామూలుగా లాండయిందని తామంతా భావించామని, అయితే ఆ తర్వాత అది తిరిగి పైకి వెళ్లి నేలను ఢీకొట్టిందని ఆయన చెప్పారు. దట్టమైన పొగ విమానాన్ని కమ్మేసినప్పుడు ఏదో జరగరానిది జరిగిందని తామంతా అనుకున్నామని కూడా ఆయన చెప్పారు. మొదట ఎమర్జెన్సీ డోర్ తెరవడం కష్టమయిందని చెప్తూ, మరో నిమిషం తాము విమానంలో ఉండినా ఘోర ప్రమాదం జరిగి ఉండేదని అన్నారు.
chitram...
దుబాయి అంతర్జాతీయ విమానాశ్రయంలో క్రాష్ లాండింగ్
అయిన వెంటనే విమానంలో పెద్దఎత్తున మంటలు, పొగలు చెలరేగిన దృశ్యం