జాతీయ వార్తలు

నైజీరియాలో ఐదుగురు భారతీయులు కిడ్నాప్ పైరేట్ల పనే: సుష్మా స్వరాజ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: నైజీరియాలో మన దేశానికి చెందిన ఐదుగురు నావికులను పైరేట్లు అపహరించినట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ వెల్లడించారు. భారతీయులను అపహరించినట్టు శుక్రవారం వచ్చిన వార్తలను మంత్రి ధ్రువీకరించారు. ‘నైజీరియాలోని భారత హైకమిషనర్ ఎఆర్ ఘనశ్యాం ఆ దేశాధ్యక్షుడితో మాట్లాడారు. బందీల విడుదలకు ఆయన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు’ అని మంత్రి తెలిపారు. పైరేట్ల చేతిలో బందీలుగా ఉన్న మన నౌకాసిబ్బంది క్షేమంగానే ఉన్నట్టు సమాచారం ఉందన్నారు. ఈనెల 11న కిడ్నాప్ చేశారని, ఐదుగురు నావికులు ఇప్పటికీ పైరేట్ల చెరలోనే ఉన్నట్టు ఆమె స్పష్టం చేశారు. నైజీరియాలోని వర్రి ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుందన్నారు.

కోర్టులో సరెండర్ అయిన
కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్

ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో బెయిల్ మంజూరు

ముజఫర్‌నగర్, డిసెంబర్ 18: ముజఫర్‌నగర్ అల్లర్ల కేసులో వారెంట్ జారీ కావడంతో కేంద్ర మంత్రి సంజీవ్ బలియన్, బిజెపి ఎమ్మెల్యే సురేష్ శుక్రవారం కోర్టులో సరెండర్ అయ్యారు. 20వేల రూపాయల సొంత పూచీకత్తు సమర్పించడంతో సంజీవ్ సహా మరో ఆరుగురికి అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ సీతారాం బెయిల్ మంజూరు చేశారు. తదుపరి విచారణకు హాజరవుతామని రాతపూర్వక హామీని వారు కోర్టుకు సమర్పించారు. కాగా, శుక్రవారం కూడా కోర్టుకు హాజరుకాని మరో బిజెపి ఎమ్మెల్యే సంగీత్ సోమ్, సాధ్వి ప్రాచిలకు మరోసారి బెయిలబుల్ వారెంట్ జారీచేశారు. ఈ కేసును జనవరి 23వ తేదీకి వాయిదా వేశారు. కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న ముజఫర్‌నగర్ ఎంపి సంజీవ్ బలియన్‌ను ఈ నెల 18న కోర్టుకు హాజరుకావాలని నవంబర్ 24వ తేదీన న్యాయమూర్తి ఆదేశిస్తూ బెయిలబుల్ వారెంట్లు జారీచేశారు. దీంతో శుక్రవారం మంత్రి సంజీవ్ తదితరులు కోర్టుకు హాజరుకావడంతో బెయిల్ మంజూరుచేశారు. నిషేధాజ్ఞలను ఉల్లంఘించడం, అధికారులను అడ్డుకోవడం వంటి నేరపూరిత చర్యలకు మంత్రి పాల్పడ్డారంటూ ప్రాసిక్యూషన్ కోర్టుకు తెలిపింది. అంతేకాకుండా నాదాల మాదోర్ పంచాయతీ సమావేశంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. 2013 ఆగస్టు- సెప్టెంబర్ నెలల్లో ముజఫర్‌నగర్ సహా పరిసర ప్రాంతాల్లో జరిగిన మత హింసలో 60మంది చనిపోగా, 40వేల మంది నిరాశ్రయులయ్యారు.

బాలీవుడ్ నటి రేఖకు
యశ్‌చోప్రా అవార్డు
టిఎస్‌ఆర్ ఫౌండేషన్ నిర్ణయం

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రముఖ చలన చిత్ర దర్శకుడు దివంగత యాశ్ చోప్రా జ్ఞాపకార్ధం రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి తన ఫౌండేషన్ పేరిట ఏర్పాటు చేసిన ప్రతిష్ఠాత్మక అవార్డు ఈ ఏడాది ప్రముఖ నటి రేఖకు లభించింది. ఫిబ్రవరిలో ముంబయిలో జరిగే ఒక కార్యక్రమంలో మహారాస్ట్ర గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్‌రావు ఈ అవార్డును రేఖకు అంద చేస్తారు. అవార్డు కింద పది లక్షల రూపాయల నగదుతోపాటు స్వర్ణ పతకాన్ని ప్రదానం చేస్తారు. చలన చిత్ర నటీ మణులు హేమమాలిని, జయప్రదతో పాటు సుబ్బిరామిరెడ్డి, బోనీకపూర్, గ్రెవాల్‌తో కూడుకున్న జ్యూరీ ఈ అవార్డుకు రేఖను ఎంపిక చేసింది. చలనచిత్ర రంగానికి చోప్రా చేసిన సేవలకు గుర్తింపుగా టిఎస్‌ఆర్ ఈ జాతీయ అవార్డును ఏర్పాటు చేశారు.

అంతర్రాష్ట స్థారుూ సంఘంలో బాబు

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అంతర్రాష్ట మండలికి అనుబంధంగా ఉన్న స్థారుూ సంఘంలో సభ్యునిగా నియమితులయ్యారు. ప్రధాని నరేంద్రమోదీ ఈ నియామకాన్ని ఖరారు చేశారు. ప్రధాని అధ్యక్షుడిగా ఉండే ఈ మండలి అత్యంత కీలకమైన నిర్ణయాలను తీసుకోవటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. బాబుతోపాటు ఒడిశా, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ , త్రిపుర ముఖ్యమంత్రులకు కూడా స్థారుూ సంఘంలో స్థానం లభించింది. కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి వెంకయ్యకు ఇటు మండలిలోనూ అటు స్థారుూ సంఘంలోనూ సభ్యత్వం లభించింది. దీనికి హోమ్ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అధ్యక్షునిగా ఉంటారు.