జాతీయ వార్తలు

హామీలకు హామీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: ఆంధ్రకు చట్టపరంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం. అందరికీ ఆమోదయోగ్యమైన పరిష్కారం కనుగొనేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. త్వరలోనే నిర్ణయాన్ని ప్రకటిస్తామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ శుక్రవారం రాజ్యసభలో హామీ ఇచ్చారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రాజ్యసభలో లేవనెత్తిన ఏపీకి ఇచ్చిన హామీల విషయం పరిశీలనలో ఉందన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం విభజన చట్టాన్ని సవరించాలని కాంగ్రెస్ సభ్యుడు రామచంద్రరావు ప్రతిపాదించిన సవరణ బిల్లుపై ఓటింగ్ జరిపేందుకు వీలులేదని వాదిస్తూ జైట్లీ ఈ ప్రకటన చేశారు. ఆంధ్రకు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్ర సిఎం చంద్రబాబు ప్రధాని మోదీతో ఈ అంశంపై చర్చలు జరిపారని వివరించారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తగు చర్యలు తీసుకుంటున్నట్టు జైట్లీ వివరించారు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 110 రెడ విత్ 117 ప్రకారం సవరణ బిల్లుపై రాజ్యసభలో ఓటింగ్ జరిపేందుకు వీలులేదని జైట్లీ స్పష్టం చేశారు. రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ద్రవ్య బిల్లు కాబట్టి దీనిపై తదుపరి చర్యలు తీసుకోకూడదని వాదించారు. సవరణ బిల్లు ద్రవ్య బిల్లు అవుతుందా? కాదా? అనే అంశంపై అనుమానాలుంటే, లోక్‌సభ స్పీకర్‌కు పంపించటం ద్వారా స్పష్టత తేవాలని జైట్లీ సూచించారు. బిల్లును నిర్ణయించే అధికారం రాజ్యసభకు లేదంటూ రాజ్యాంగంలోని వివిధ ఆర్టికల్స్‌ను ఉటంకించారు. రాజ్యాంగ నిర్మాతలు కొన్ని ఆర్థికాంశాలను రాజ్యసభకు దూరంగా పెట్టారని, అలాంటి అంశాలను కేవలం లోక్‌సభ మాత్రమే పరిశీలిస్తుందని స్పష్టం చేశారు. కాంగ్రెస్ సభ్యులు రామచందర్‌రావు, రేణుకాచౌదరి, టి సుబ్బిరామిరెడ్డి ఆయన వాదనతో ఏకీభవించలేదు. ఓటింగ్ సమయంలో ఇలా అభ్యంతరం పెట్టటం అన్యాయమని వాదించారు. దీనికి జైట్లీ రాజ్యాంగాన్ని ఉటంకిస్తూ, బిల్లుపై ఏ దశలోనైనా ప్రభుత్వం అభ్యంతరం తెలియజేయవచ్చని సూచించారు. కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి నిధులు తీసుకునేందుకు ఉద్దేశించే ప్రతి బిల్లూ ద్రవ్య బిల్లు అవుతుందని జైట్లీ సూచించారు. రామచందర్‌రావు ప్రతిపాదించిన సవరణ బిల్లు ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. ప్రత్యేక హోదా ప్రకారం ఏపీలో అమలు చేసే పథకాలకు కేంద్రం 90శాతం నిధుల ఇవ్వాల్సి ఉంటుంది. ఆర్థిక లోటును భర్తీ చేసేందుకు ఆర్థిక సహాయం చేయాలి. పోలవరం జాతీయ ప్రాజెక్టు, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి నిధులివ్వాలి. అందుకే ఇది ద్రవ్య బిల్లు అవుతుందని జైట్లీ వాదించారు. అయితే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కపిల్ సిబల్ మాత్రం జైట్లీ వాదనతో అంగీకరించలేదు. రాజ్యసభ ముందుకొచ్చే ప్రతి బిల్లుకూ ఏదోరకంగా డబ్బుతో సంబంధం ఉంటుంది కాబట్టి, వాటన్నింటినీ ద్రవ్య బిల్లుగా పరిగణించలేమని ఆయన స్పష్టం చేశారు.