జాతీయ వార్తలు

అరుణాచల్ గవర్నర్‌ను రీకాల్ చేయండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: రాజ్యాంగ పరిరక్షకునిగా వ్యవహరించవలసిన అరుణాచల్‌ప్రదేశ్ గవర్నర్ ప్రజాస్వామ్యానికి తీవ్ర విఘాతం కలిగించే తీరులో వ్యవహరిస్తున్నందున వెంటనే రీకాల్ చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం రాజ్యసభను స్తంభింపచేశారు. కాంగ్రెస్ సభ్యుల నినాదాల కొనసాగించడంతో ప్రయివేట్ మెంబర్ బిల్లులను కూడా చేపట్టకుండానే సోమవారానికి వాయిదా పడిపోయింది. ప్రతిపక్ష నాయకుడు గులామ్ నబీ ఆజాద్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం మద్దతుతోనే గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. మంత్రి వర్గం ఆమోదం లేకుండా శాసనసభను సమావేశపరిచే అధికారం గవర్నర్‌కులేదని ఆయన అన్నారు. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఈ నియమాన్ని పక్కన పెట్టి శాసనసభ సమావేశపరిచారని ఆయన విమర్శించారు. స్పీకర్ స్థానంలో తిరుగుబాటు అభ్యర్థిని స్పీకర్‌గా సభను నడిపే అవకాశం కల్పించడం అనైతికమని ఆజాద్ స్పష్టం చేశారు. గవర్నర్ తీసుకున్న ఈ నిర్ణయాలపై గౌహతి హైకోర్టు స్టే విధించిందని ఆయన గుర్తుచేశారు. ఒక రెస్టారెంట్‌లో పోటీ సమావేశాన్ని నిర్వహించటం సిగ్గు చేటుకాదా?అని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతల పరిరక్షణకు అవసరమని భావిస్తే పారామిలటరీ బలగాలను కేంద్రం నుంచి కోరే అధికారం ఒక్క రాష్ట్ర ప్రభుత్వానికి మాత్రమే ఉండగా, ముఖ్యమంత్రి ప్రమేయం లేకుండా గవర్నర్ నేరుగా కేంద్రంతో మాట్లాడి పారామిలటరీ బలగాలను రప్పిస్తున్నారని ఆయన విరుచుకుపడ్డారు. గవర్నర్ రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిసికూడా కూడా మనం వౌనంగా ఉండిపోతే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే అవుతుందని ఆజాద్ అన్నారు. ఆజాద్ వ్యక్తం చేసిన అభిప్రాయాలతోప్రతిపక్షాలు సమర్ధించాయి.
ఆర్‌జెడి సభ్యుడు ఒపి త్యాగి మాట్లాడుతూ బార్లు, రెస్టారెంట్‌లో సభా సమావేశాలను నిర్వహించటం కంటే అవమానం మరొకటి ఉండదని చెప్పారు. గవర్నర్‌ను వెంటనే రీకాల్ చేసి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటానికి సిద్ధం కావాలన్నారు. గవర్నర్‌పై ప్రతిపక్షాలు ప్రతిపాదించిన తీర్మానంపై చర్చకు చైర్మన్ అనుమతి మంజూరు చేశారని డిప్యూటీ చైర్మన్ కురియన్ తెలియ చేశారు. చర్చ జరిగే సమయాన్ని ఖరారు చేయవలసి ఉందని ఆయన చెప్పారు. అయినా కాంగ్రెస్ సభ్యులు నినాదాలు ఆపకపోవటంతో 12 గంటల వరకూ సభను వాయిదా వేశారు. 12గంటలకు చైర్మన్ అన్సారీ సభకు వచ్చి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టి నినాదాల హొరులోనే కొంత సేపుసభను నిర్వహించారు. సభ్యులు శాంతించకపోవడంతో సభను వాయిదావేశారు. రెండున్నర గంటలకు ప్రారంభమైన సభ కొద్ది క్షణాలకే సోమవారానికి వాయిదా పడింది.