జాతీయ వార్తలు

పాక్ తీరును ఎండగట్టా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: పాకిస్తాన్‌లో జరిగిన సార్క్ సమావేశంలో భారత దేశం ఉగ్రవాదానికి వ్యతిరేకంగా నిలబడిందని, మిగతా సార్క్ దేశాలను కూడా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని స్పష్టంగా చెప్పిందని కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చెప్పారు. ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన సార్క్ హోం మంత్రుల సమావేశంలో పాల్గొని తిరిగి వచ్చిన రాజ్‌నాథ్ సింగ్ తన పర్యటనపై శుక్రవారం పార్లమెంటు ఉభయ సభల్లోను ఒక ప్రకటన చేశారు. కేవలం ఉగ్రవాదంపైనే కాకుండా ఉగ్రవాదానికి మద్దతిచ్చే దేశాలపైనా చర్యలు తీసుకోవాలని సమావేశంలో భారత్ కోరినట్లు ఆయన చెప్పారు. ఒక దేశ ఉగ్రవాది మరో దేశానికి పోరాట యోధుడు కాలేడని పాకిస్తాన్‌కు భారత్ స్పష్టంగా చెప్పిందని ఆయన అంటూ, నేరాలకు సంబంధించిన విషయాల్లో పరస్పర సహకారంపై సార్క్ ఒప్పందంపై పాక్ సంతకం చేస్తుందని, సార్క్ ఉగ్రవాద నేరాల మానిటరింగ్ డెస్క్‌ను ఏర్పాటు చేస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.
కాశ్మీర్‌లో భద్రతా దళాలు ఇటీవల హతమార్చిన ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ బుర్హాన్ వనీని పోరాట యోధుడిగా, అమర వీరుడిగా అభివర్ణిస్తూ, అతని హత్యను ఖండిస్తూ పాక్ ఒక ప్రకటన చేయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజ్‌నాథ్ సింగ్ ఇస్లామాబాద్‌లో జరిగిన సార్క్ సదస్సులో ఉగ్రవాదానికి పాక్ ఊతమివ్వడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ‘నేరాలకు సంబంధించిన విషయాల్లో పరస్పర సహకారానికి సంబంధించిన సార్క్ ఒడంబడికపై పాక్ ఇప్పటికీ సంతకం చేయలేదు. అంతేకాదు, సార్క్ ఉగ్రవాద నేరాల మానిటరింగ్ డెస్క్‌ను, సార్క్ మాదక ద్రవ్య నేరాల మానిటరింగ్ డెస్క్‌లను ఏర్పాటు చేయడంపై కూడా అది ఇప్పటివరకు తన అంగీకారాన్ని తెలియజేయలేదు. అయితే త్వరలోనే ఈ అంశాలపై చర్యలు తీసుకుంటామని పాక్ పేర్కొంది. త్వరలోనే అంటే నిజంగా త్వరలోనే జరుగుతుందని నేను ఆశిస్తున్నాను’ అని రాజ్‌నాథ్ చెప్పారు. ఇస్లామాబాద్‌లో సార్క్ హోం మంత్రుల సమావేశం జరిగిన హాలులోపలికి భారతీయ మీడియాను అనుమతించలేదని రాజ్‌నాథ్ చెప్పారు. తన ప్రకటన అనంతరం సభ్యులు అడిగిన ప్రవ్నలకు ఆయన సమాదానమిస్తూ, ‘నా ప్రసంగాన్ని పాక్ ప్రసారం చేయకపోవడంపై నేను మాట్లాడను.. అయితే సమావేశంలోకి పిటిఐ, దూరదర్శన్ సహా భారతీయ మీడియా సంస్థలను నా ప్రసంగం సమయంలో లోపలికి అనుమతించలేదు.. ఈ విషయం చెప్పడానికి కాస్త ఇబ్బందికరంగా ఉంది’ అని రాజ్‌నాథ్ అన్నారు. కాగా, పాక్ హోం మంత్రి ఇచ్చిన విందును బాయ్‌కాట్ చేసినందుకు పలువురు సభ్యులు రాజ్‌నాథ్‌ను అభినందించడమే కాకుండా, భారత హోం మంత్రి పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించిందని విమర్శించారు. పాక్ మంత్రి ఏర్పాటుచేసిన విందుకు వెళ్లకపోవడం గురించి అడగ్గా, ‘దేశ గౌరవ మర్యాదలను దృష్టిలో పెట్టుకుని నేను ఏం చేయాలో అది చేశాను.. దీనిపై నేను ఎలాంటి ఫిర్యాదు చేయను.. నేను అక్కడికి విందు చేయడం కోసం వెళ్లలేదు’ అని రాజ్‌నాథ్ సింగ్ అన్నప్పుడు సభ్యులంతా ‘సిగ్గు, సిగ్గు’ అంటూ పాక్ మంత్రి ప్రవర్తించిన తీరును ఖండించారు.
భారత్‌కు, రాజ్‌నాథ్ పర్యటనకు వ్యతిరేకంగా ప్రదర్శనలను పాక్ అనుమతించడాన్ని కూడా రాజ్యసభ సభ్యులు ఖండించారు. ముందు అనుకున్న ప్రకారం అయితే రావల్పిండి ఎయర్‌బేస్‌నుంచి తాను హోటల్‌కు రోడ్డు మార్గంలో చేరుకోవలసి ఉండిందని, అయితే హెలికాప్టర్‌ను ఉపయోగించాలని ఆ తర్వాత భద్రతా దళాలు నిర్ణయించుకుని ఉంటాయని రాజ్‌నాథ్ అన్నారు. చాలాచోట్ల జనం నిరసన ప్రదర్శనలు చేయడాన్ని తాను చూశానని ఆయన చెప్తూ, నిరసనల గురించి తాను పట్టించుకోలేదని, అలా పట్టించుకునే వాడినే అయితే పాకిస్తాన్‌కు వెళ్లే వాడిని కాదని స్పష్టం చేశారు.