జాతీయ వార్తలు

త్యాగాలను స్మరించుకుందాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశానికి స్వాతంత్య్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా భారీ ఎత్తున పక్షం రోజుల పాటు దేశవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించాలని ఎన్‌డిఏ సర్కార్ భావిస్తోంది. మధ్యప్రదేశ్‌లోని చంద్రశేఖర్ ఆజాద్ జన్మస్థలానికి వెళ్లి ఆయనకు నివాళులర్పించడం ద్వారా ఈ పదిహేను రోజుల స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రధాని మోదీ శ్రీకారం చుడతారు. రాజ్‌పథ్‌లో వారం రోజుల పాటు అనేక కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు దేశవ్యాప్తంగా విస్తృత స్థాయిలోనే వేడుకలకు ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు బిజెపిలు సంయుక్తంగా, అలాగే విడివిడిగా ఈ కార్యక్రమాలను చేపడతాయి. సరిహద్దు ప్రాంతాల్లో ఆశాభోంస్లే, కుమార్‌సాను వంటి గాయకులతో కచేరీలు నిర్వహిస్తారు. ఈ ప్రాంతాల్లో పనిచేస్తున్న సైనికులకు ఎనిమిది మంది మహిళా మంత్రులు స్వయంగా వెళ్లి రాఖీలు కడతారు. ఆగస్టు 9న భటిండాలో జరిగే క్విట్ ఇండియా కార్యక్రమంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమం మధ్యప్రదేశ్‌లోని గిరిజన ప్రాంతమైన బాభ్రాలో జరుగుతుంది. మరోపక్క కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు ముంబయి వెళ్లి క్రాంతిమైదాన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఇక్కడినుంచే 1942లో మహాత్మాగాంధీ క్విట్ ఇండియా ఉద్యమానికి పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ఇటు దేశ స్వాతంత్య్ర ఉద్యమంతోనూ, స్వాతంత్య్ర సమరయోధులతోనూ ముడిపడి వున్న ప్రాంతాలకు 75మంది కేంద్ర మంత్రులు వెళతారు. ఈ నెల 12న పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ముగిసిన అనంతరం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాల్లో మంత్రులు చురుగ్గా పాల్గొంటారు. బ్రిటిష్ హయాంలో వేలాదిమంది స్వాతంత్య్ర సమరయోధులను నిర్బంధించిన, అలాగే వందలాదిమంది మరణించిన కేంద్రంగా ప్రసిద్ధి చెందిన పోర్ట్‌బ్లెయిర్‌ను రక్షణ మంత్రి మనోహర్ పారికర్ సందర్శిస్తారు. ఆ సందర్భంగా సమరయోధులకు నివాళులర్పిస్తారు. దేశ సాంస్కృతిక శాఖ కూడా అనేక కార్యక్రమాలకు సిద్ధమవుతోంది. మొత్తం ఏడు రోజుల పాటు రాజ్‌పథ్‌లో అనేక కార్యక్రమాలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. స్వాతంత్య్ర వేడుకల సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేకంగా రూపొందించిన గీతాన్ని కూడా విడుదల చేసే అవకాశముంది.

స్వాతంత్య్ర దినోత్సవ పరేడ్‌లో విన్యాసాల ప్రదర్శనకు అజ్మీర్‌లో
రిహార్సల్స్ చేస్తున్న మహిళా పోలీసు అధికారులు

వెంకయ్యనాయుడు సారథ్యంలో ఏర్పాటైన మంత్రుల బృందం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సంబంధించిన కార్యక్రమాలను సమన్వయపరిచే బాధ్యతను నిర్వహిస్తుంది. పార్టీపరంగా బిజెపి కూడా మోదీ సర్కార్ కార్యక్రమాలను మరింతగా జనంలోకి తీసుకెళ్లేందుకు ఎన్నో కార్యక్రమాలను చేపట్టబోతోంది. ఈ సందర్భంగా సమరయోధుల కుటుంబీకులను మాజీ సైనికులను ముఖ్యంగా శౌర్య, సాహస అవార్డులు పొందినవారిని కూడా సత్కరిస్తారు. అలాగే ప్రతి ఎంపి కూడా తన నియోజకవర్గ పరిధిలో ఆగస్టు 15 నుంచి 22 మధ్య తిరంగా యాత్రను చేపడతారు. జాతీయ పతాకాన్ని చేతబట్టుకుని ద్విచక్ర వాహనాలపై అనేక ప్రాంతాలను సందర్శించి స్వాతంత్య్ర యోధులకు నివాళులర్పిస్తారు. నవతరానికి స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను గుర్తుచేయడంతోపాటు నాటి దేశభక్తి స్ఫూర్తిని వాడవాడలా ప్రేరేపించే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమాలను చేపడుతున్నామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు వివరించారు. ఈ కార్యక్రమాలన్నింటిద్వారా దేశ స్వాతంత్య్రం గురించే కాకుండా ఎంత కష్టపడితే, ఎన్ని త్యాగాలు చేస్తే ఇది సిద్ధించిందన్న వాస్తవాన్ని కూడా నేటి తరానికి తెలియజేయాలని సంకల్పించినట్లు తెలిపారు.