జాతీయ వార్తలు

జ్యోతిలక్ష్మి కన్నుమూత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 9: తెలుగు, మలయాళ, తమిళ, కన్నడ భాషల్లో దాదాపు 300 చిత్రాలకు పైగా నటించి తనదైన నాట్య విన్యాసంతో కౌబాయ్ తరహా పాత్రలతో ఆనాటి ప్రేక్షక లోకాన్ని విశేషంగా మెప్పించిన నటి జ్యోతి లక్ష్మి(68) బ్లడ్‌క్యాన్సర్‌తో సోమవారం అర్ధరాత్రి చెన్నైలో కన్నుమూశారు. ఇటీవల తీవ్ర అస్వస్థతకు గురికావటంతో ఇటీవలే ఆమె ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. బ్లడ్‌క్యాన్సర్ నుంచి ఆమె క్రమంగా కోలుకుంటున్న తరుణంలో పరిస్థితి ఆకస్మికంగా విషమించి కన్నుమూశారు. ఆమె అంత్యక్రియలు చెన్నైలోని కన్నమ్మ పిట్టాయ్ శ్మశాన వాటికలో మంగళవారం జరిగాయి. బాలీవుడ్ హెలెన్ మాదిరిగా తెలుగు చిత్రాల్లో కూడా డాన్సులతో హోరెత్తించిన ఘనత జ్యోతిలక్ష్మిదే.
అసలు క్లబ్ సాంగ్‌లన్నది జ్యోతిలక్ష్మితోనే పుట్టాయన్నా ఆశ్చర్యపోవలసిన అవసరం లేదు. అరవయ్యో దశకం తొలినాళ్లలో ఎంజి ఆర్, బి.సరోజ నటించిన ఓ తమిళ చిత్రం ద్వారా పరిచయమైన జ్యోతిలక్ష్మి అనంతర కాలంలో అద్భుతమైన డాన్సర్‌గా, క్లబ్‌డాన్సర్ స్పెషలిస్టుగా, కౌబాయ్ తరహా పాత్రలకు పెట్టింది పేరుగా నిలిచారు. స్వతహాగా మంచి నటి కావటంతో నాటి సినిమాల్లో ఆమె పాట ఉండటం అన్నది వాటి విజయానికి ఎంతగానో దోహదం చేస్తుందన్న నమ్మకం నిర్మాతల్లో కలిగేది. ఎఎన్నార్, ఎన్టీఆర్, కృష్ణ, హర్‌నాథ్ సహా అందరు అగ్రహీరోలతోనూ నాటి సినిమాల్లోనూ జ్యోతిలక్ష్మి పాట ఓ ప్రత్యేక ఆకర్షణగా నిలిచేది. అందుకే ప్రతి నిర్మాత కూడా తన సినిమాలో కచ్చితంగా జ్యోతిలక్ష్మి పాట ఉండేలా చూసుకునేవారు. దాదాపు నాలుగు దక్షిణాది భాషల్లోనూ, నేటి ఐటం సాంగ్స్‌గా పేర్కొంటున్న నాటి క్లబ్ డాన్సుల్లో జ్యోతిలక్ష్మి నటించారు. పిల్లా పిడుగా చిత్రంతో నర్తకిగానే కాకుండా ప్రత్యేక కౌబాయ్ తరహా పాత్రలో కనిపించిన జ్యోతిలక్ష్మి అలాంటి ఎన్నో చిత్రాల్లో నటించారు.
ముఖ్యంగా హాలీవుడ్ తరహా కథాంశాలతో నిర్మించిన ఎన్నో తెలుగు చిత్రాల్లో జ్యోతిలక్ష్మి ప్రధాన పాత్ర పోషించారు. ఆమెసోదరి జయమాలిని సినీ రంగ ప్రవేశం చేయటంతో స్వతహాగా నర్తకి కావటంతో జ్యోతిలక్ష్మి ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వచ్చింది. ఎనభయ్యో దశకం నాటికి దాదాపుగా తెరమరుగైపోయారు. పిల్లా పిడుగా, గంధర్వ కన్య, సీతారాములు, హిందీలో పిస్తోల్ వాలి తదితర ఎన్నో చిత్రాల్లో ఆమె నటించారు. జ్యోతిలక్ష్మి మరణం పట్ల తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత సహా సినీ ప్రముఖులు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. జ్యోతిలక్ష్మి ఎలాంటి పాత్ర ఇచ్చినా అందులో మమేకమై మెప్పించిన నటిగా జయలలిత ప్రశంసించారు.