జాతీయ వార్తలు

ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ,ఆగస్టు 9: జిఎస్‌టి కారణంగా అమ్మకం పన్ను కేంద్రం పరిధిలోకి పోతే ఏపి అభివృద్ధికి ప్రత్యేక హోదా ఇవ్వకతప్పదని వైకాపా అధ్యక్షుడు,ప్రతిపక్షం నాయకుడు వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, సిపిఐ కార్యదర్శి డి.రాజా, రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్‌ను కలిసి ప్రత్యేక హోదా, రక్షణ శాఖ విమానం ఏఎన్.32 గల్లంతు తదితర అంశాల గురించి చర్చించారు. అనంతరం విలేఖరులతో మాట్లాడిన జగన్ ప్రత్యేక హోదా స్థానం ప్రత్యేక ప్యాకేజీ కోసం రాజీపడే వారు చరిత్ర హీనులుగా మిగిలిపోతారని హెచ్చరించారు. జాతీయ నాయకులను కలిసిన అనంతరం విలేఖరులతో మాట్లాడిన ఆయన జిఎస్‌టి అమలు నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్కేక హోదా అవసరం మరింత పెరిగిందన్నారు. అమ్మకం పన్ను కేంద్రం పరిధిలోకి పోతే రాష్ట్రాల ఆదాయం మరింత తగ్గిపోతుందన్నారు. దీని వల్ల ఏ.పికి రెండు విధాల నష్టం వస్తుందన్నారు. అమ్మకం పన్ను ఇచ్చే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవటంతో ఏపీకి కొత్తగా ఎలాంటి పరిశ్రమలు రావన్నారు. కొత్త పరిశ్రమల స్థాపన జరగాలంటే అమ్మకం పన్ను రాయితీ ఇవ్వాల్సి ఉంటుందని, అది ప్రత్యేక హోదా లభిస్తేనే సాధ్యమవుతుందని చెప్పారు.
అమ్మకం పన్ను కేంద్రం పరిధిలోకి పోవటంతో ఆంధ్రప్రదేశ్ ఆదాయం బాగా పడిపోతుందనే ఆందోళనను వ్యక్తం చేశారు. పరిశ్రమల స్థాపన జరగకపోతే యువతకు ఉపాధి లభించదని చెప్పారు. హైదరాబాదు లేక, ప్రత్యేక హోదా లేక, పన్ను రాయితీ ఇచ్చే అవకాశమూ చేజారితే ఏపి ఎలా అభివృద్ధి చెందుతుందని ప్రశ్నించారు. ప్యాకేజీ ఇవ్వటం వలన ఏపికి తీరని అన్యాయం జరిగిపోతోందని హెచ్చరించారు.
రాష్ట్రానికి ఇప్పటికే ఒక లక్షా అరవై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చామని బిజెపి ప్రభుత్వం చెబుతుంటే అలాంటిదేదీ లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పటం మరిచిపోరాదని అన్నారు. ప్యాకేజీ వలన వాస్తవంగా ఓరిగేదీ ఏమీ ఉండదన్నారు. వంద సంవ్సరాలు పోరాడితే స్వాతంత్ర వచ్చిందని పేర్కొన్న జగన్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం ఎంత కాలమైనా పోరాడుతామని ప్రకటించారు. చెన్నై నుండి అండమాన్ వెళుతూ కనిపించకుండా పోయిన ఏఎన్.32 విమాన ప్రమాదంలో మృతి చెందిన వారిలో ఉన్న పౌర సిబ్బందికి కూడా రక్షణ సిబ్బందితో సమాన నష్ట పరిహారం చెల్లిస్తామని, పెన్షన్ సౌకర్యం కల్పిస్తామని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ హామీ ఇచ్చినట్టు జగన్ ఈ సందర్భంగా వెల్లడించారు.