జాతీయ వార్తలు

దద్దరిల్లిన లోక్‌సభ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం రాజ్యాంగ విరుద్ధంగా వ్యవహరిస్తోందంటూ కాంగ్రెస్ సభ్యులు శుక్రవారం లోక్‌సభలో దాదాపు గంటరన్నర పాటు నినాదాలు చేసి, సభ నుంచి వాకౌట్ చేశారు. కాంగ్రెస్ సభ్యులు పార్లమెంటు నియమ, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారంటూ స్పీకర్ సుమిత్రా మహాజన్ విమర్శించారు. వారిలా వ్యవహరించటం దురదృష్టకరమని ఆమె కాంగ్రెస్ సభ్యుల తీరును తప్పుపట్టారు. కాంగ్రెస్ సభ్యులు వాకౌట్ చేసిన అనంతరం లోక్‌సభ సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది. లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే స్పీకర్ సుమిత్రా మహాజన్ మాట్లాడుతూ కాంగ్రెస్ పక్షం నాయకుడు మల్లిఖార్జున ఖర్గే, జ్యోతిరాధిత్య సింధియా, వైకాపా తదితర నాయకులు వివిధ అంశాలపై ఇచ్చిన వాయిదా తీర్మానాలను తిరస్కరిస్తున్నట్లు ప్రకటించి ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని చేపట్టారు. సుమిత్రా మహాజన్ నిర్ణయాన్ని వ్యతిరేకించిన కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ పోడియం వద్ద గొడవ చేశారు. ప్రభుత్వానికి, ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలను స్తంభింపజేసేందుకు ప్రయత్నించారు. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్ పోడియం వద్ద నిలబడి నినాదాలు ఇవ్వటంతో సభ దద్దరిల్లిపోయింది. స్పీకర్ కాంగ్రెస్ సభ్యులకు నచ్చజెప్పేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ‘మీరెందుకిలా వ్యవహరిస్తున్నారు? పార్లమెంటు నియమ, నిబంధనలకు విరుద్దంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’అని ఆమె కాంగ్రెస్ సభ్యులను ప్రశ్నించారు. కాంగ్రెస్ సభ్యుల వ్యవహారం తనకు బాధ కలిగిస్తోందని ఆమె చెప్పారు. రోజూ ఏదో ఒక అంశంపై గొడవ చేస్తూ లోక్‌సభను స్తంభింపజేసేందుకు ప్రయత్నించటం ఎంత మాత్రం మంచిది కాదని పదే పదే హెచ్చరించారు. కాంగ్రెస్ సభ్యులు స్పీకర్‌ను పట్టించుకోకుండా తమ నినాదాలు కొనసాగించారు. కాంగ్రెస్ సభ్యులు ఎంతకూ వినకపోవటంతో సుమిత్రా మహాజన్ ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నినాదాల గందరగోళం మధ్యనే కొనసాగించారు. ప్రశ్నోత్తరాల కార్యక్రమం కొనసాగినంత సేపు కాంగ్రెస్ సభ్యులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తూనే ఉన్నారు. జీరో అవర్‌లో కూడా కాంగ్రెస్ సభ్యులు తమ నినాదాలు కొనసాగించారు. జీరో అవర్‌లో కూడా దాదాపు అర్థగంట పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు ఇస్తూ సభా కార్యక్రమాలకు అడ్డుతగిలి, తరువాత సభ నుంచి వాకౌట్ చేశారు.

శుక్రవారం రాజ్యసభ, లోక్‌సభ పోడియంల వద్ద ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేయడంతో స్తంభించిన కార్యకలాపాలు