జాతీయ వార్తలు

అధికార సాధనతోనే ఆఫ్‌స్పానుంచి విముక్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 9: సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (ఆఫ్‌స్పా) రద్దు చేయాలంటూ పదహారేళ్ల పాటు అవిశ్రాంతంగా నిరాహార దీక్ష చేసిన మణిపూర్ ఉక్కు మహిళ ఇరోమ్ షర్మిళ మంగళవారం తన దీక్షను విరమించారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురైన ఇరోమ్ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంఫాల్‌లోని ప్రభుత్వ ఆసుపత్రి వద్ద జైలుగా మార్చిన ఓ గదిలో అరచేతిలోని తేనెను స్వీకరించి దీక్ష విరమించారు. ఆఫ్‌స్పా వంటి చట్టాన్ని రద్దు చేయాలంటే ముఖ్యమంత్రి పదవి చేపట్టడం ఒకటే మార్గమని స్పష్టం చేశారు. ‘రాష్ట్రంలో సానుకూల పరిస్థితులు తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి పదవిని చేపట్టాలని కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత మొట్టమొదట తాను చేయబోయేది ఆఫ్‌స్పాను రద్దుచేయడమే’నని ఇరోమ్ ప్రకటించారు. దీక్ష అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ ‘నాకు అధికారం కావాలి. మణిపూర్ రాజకీయాలు మురికికూపంగా మారాయి. ఇందులో ప్రజలు కూరుకుపోతున్న విషయం వారికి తెలియడం లేదు’ అని వ్యాఖ్యానించారు. ‘నాతో కలిసి పనిచేసేందుకు 20మంది స్వతంత్ర అభ్యర్థులు కావాలి. ముఖ్యమంత్రి ఇబోబిని గద్దె దించేందుకు వారి సహకారం కావాలి’ అని ఇరోమ్ ప్రకటించారు. ప్రధాని నరేంద్ర మోదీ గురించి విలేఖరులు అడిగినప్పుడు ‘ఆఫ్‌స్పాను రద్దుచేసినప్పుడే మణిపూర్ ప్రజలకు దగ్గర కాగలుగుతారు. మహాత్ముని బాటలో అహింసా మార్గాన్ని అనుసరించాలి. ప్రస్తుత సమయంలో ఈ మార్గం మోదీకి చాలా అవసరం’ అని బదులిచ్చారు. నేను మానవమాత్రురాలినని, మణిపూర్ ప్రజలు నన్ను దేవతగా పిలిపించుకోవడాన్ని ఇష్టపడనని స్పష్టం చేశారు. పదహారేళ్ల పాటు నిరహారదీక్షతో పోరాడానని, ఆ పోరాటాన్ని ఇప్పుడు రాజకీయ బాటలో దాన్ని కొనసాగిస్తానని ఇరోమ్ పేర్కొన్నారు.
వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల
అంతకుముందు ఉదయం కోర్టుకు హాజరైన ఇరోమ్ పదహారేళ్ల తన దీక్షను విరమిస్తున్నట్లు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్‌కు తెలపడంతో వ్యక్తిగత పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీచేశారు. నేరాన్ని అంగీకరిస్తేనే విడుదల చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేయడంతో అందుకు ఆమె అంగీకరించలేదు. దీంతో చివరకు పదివేల రూపాయల వ్యక్తిగత పూచీకత్తుపై విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు. ఇరోమ్ షర్మిళ కేసు వాదోపవాదాలు, దీక్ష విరమిస్తున్నట్లు గతంలోనే ఆమె ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం పశ్చిమ ఇంఫాల్‌లోని కోర్టు లోపల, వెలుపల కిక్కిరిసిపోయింది. బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించిన వెంటనే ఆమెను ఆసుపత్రి ప్రాంగణంలోని జైల్‌వార్డులోకి అతికష్టంమీద తరలించారు. ఈ నెల 23న తిరిగి కోర్టులో హాజరుకావాలని న్యాయమూర్తి ఆదేశించారు.