జాతీయ వార్తలు

ఎస్సీ వర్గీకరణకు కేంద్రం సానుకూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ఎస్సీ కులాల వర్గీకరణకు కేంద్ర ప్రభుత్వ సానుకూలంగా ఉందని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. బుధవారం జంతర్‌మంతర్ వద్ద ఎమ్మార్పీస్ ఆధ్యర్యంలో ఎస్సీ వర్గీకరణ కోరుతూ చేపట్టిన నిరసన కార్యక్రమానికి కేంద్రమంత్రులు వెంకయ్య నాయుడు, బండారు దత్తాత్రేయ హాజరయ్యా రు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ అని, న్యాయమైన డిమాండ్‌తో జరుగుతున్న ఉద్యమం విజయం సాధిస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ప్రధాని నరేంద్రమోదీకి వివరించినట్లు ఆయన తెలిపారు. అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరిగే విధంగా ముందుకెళ్తామని ప్రధాని హామీ ఇచ్చారని ఆయన వివరించారు. ఎస్సీ వర్గీకరణకు ప్రధాన రాజకీయ పార్టీల ఏకాభిప్రాయం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. వర్గీకరణ జరుగుతుందన్న పూర్తి విశ్వాసం తనకు ఉందని, బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేంత వరకు సంయమనం పాటించాలని ఆయన మాదిగలను కోరారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన పోరాటమని ఈ సందర్భంగా మరో కేంద్ర మంత్రి దత్తాత్రేయ అన్నారు. యూపీఏ హయాంలో ఉషా మెహ్రా కమీషన్ వర్గీకరణకు అనుకూలంగా నివేదిక ఇచ్చినా వర్గీకరణ చేయడం విఫలమయ్యారని తెలిపారు.టిడిపి నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు మాట్లాడుతూ మాదిగలకు దేవుడిచ్చిన వరం మందకృష్ణ మాదిగ అన్నారు. ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఈ సందర్భంగా మాట్లాడుతూ మాదిగ జాతి భవిష్యత్తును కాపాడాల్సిన బాధ్యత మీదేనంటూ వెంకయ్యనాయుడిని ఉద్వేగంగా వేడుకున్నారు.
మాల మహానాడు ధర్నా
ఎస్సీ వర్గీకరణకు కేంద్రమంత్రులు వెంకయ్యనాయుడు,బండారు దత్తాత్రేయలు మద్దతునివ్వడాన్ని నిరసిస్తూ మాల మహానాడు బిజెపి కేంద్ర కార్యాలయం ముందు నిరసన కార్యక్రమం నిర్వహించింది.