జాతీయ వార్తలు

సిడిలనూ సాక్ష్యంగా చూడాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, నవంబర్ 25: ఒక కేసుకు సంబంధించి సిడిలు, పత్రాలను కూడా సాక్ష్యంగా పరిగణలోకి తీసుకోవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ ఆధారాలు నిజమైనవా కాదా అని నిరూపించుకునే అవకాశం కక్షిదారులకు ఇవ్వాలని సుప్రీం కోర్టు పేర్కొంది. సిడి ప్రామాణికతకు సంబంధించి ఎలాంటి నిర్ణయం వెలుబుచ్చని న్యాయస్థానం షంషేర్ సింగ్ వర్మ కేసులో దాన్ని పరిగణనలోకి తీసుకోవాలని జస్టిస్ దీపక్‌వర్మ, జస్టిస్ పిసి పంత్‌తో కూడిన ధర్మాసనం తెలిపింది. బాలలపై లైంగిక దాడి కేసులో వర్మ అభియోగాలు ఎదుర్కొంటున్నాడు. కక్షిదారుడికి సంబంధించి ఫోన్ సంభాషణలను సాక్ష్యంగా తీసుకోవాలని బెంచ్ ఆదేశించింది. వర్మ ఫోన్ సంభాషణలను పరిగణనలోకి తీసుకోవడానికి ట్రయల్ కోర్టు నిరాకరించింది. పంజాబ్, హర్యానా హైకోర్టు కూడా కింది కోర్టును సమర్థించింది. దీంతో అతడు సుప్రీంను ఆశ్రయించాడు. పిటిషన్‌ను విచారించిన ధర్మాసనం సిడి, ఫోన్ టేపును సాక్ష్యం తీసుకోవాలని హైకోర్టును ఆదేశించింది.

‘చెల్లని డిగ్రీల’ సమాచారాన్ని
ఎందుకు ఇవ్వటంలేదు?
* యుజిసికి సిఐసి మందలింపు
* షోకాజ్ నోటీసు జారీ
న్యూఢిల్లీ, నవంబర్ 25: మోసానికి పాల్పడిందనే అభియోగంపై ఒక డీమ్డ్ యూనివర్శిటీపై నమోదయిన ఒక కేసుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఇవ్వనందుకు యూనివర్శిటి గ్రాంట్స్ కమిషన్ (యుజిసి)ని కేంద్ర సమాచార కమిషనర్ (సిఐసి) మందలించారు. చెల్లని మెడికల్ డిగ్రీలను జారీ చేస్తున్నట్లు అభియోగాలు ఎదుర్కొంటున్న సంస్థను గట్టిగా సమర్థించడంతో పాటు కేవలం ‘తపాలా కార్యాలయం’ పాత్ర నిర్వహిస్తున్న యుజిసిపై సిఐసి శ్రీ్ధరాచార్యులు మండిపడ్డారు. సమాచార హక్కు చట్టం (ఆర్‌టిఐ) కింద దరఖాస్తుదారు అడిగిన సమాచారాన్ని ఇవ్వనందుకు సంబంధిత అధికారులకు గరిష్ఠంగా రూ. 25వేల జరిమానాను ఎందుకు విధించకూడదో తెలపాలంటూ యుజిసికి సిఐసి షోకాజ్ నోటీసు జారీ చేశారు. యుజిసికి చెందిన సిపిఐఒ డీమ్డ్ యూనివర్శిటీని ఫీజు తీసుకుంటున్న న్యాయవాది వలె గట్టిగా సమర్థిస్తోందని సిఐసి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘డీమ్డ్ యూనివర్శిటీ 42 మంది విద్యార్థుల నుంచి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 40 లక్షల చొప్పున వసూలు చేసింది. నిజానికి ఒక్కో విద్యార్థి నుంచి రూ. 3.5 లక్షల చొప్పున మాత్రమే ఫీజు తీసుకోవాలి. తీరా వారికి గుర్తింపు లేని డిగ్రీలను జారీ చేసింది. దీంతో ఒక విద్యార్థి వర్శిటీపై మోసం చేసిందంటూ కేసు పెట్టారు’ అని సిఐసి ఈ సందర్భంగా తెలిపారు.