జాతీయ వార్తలు

తొలగిన ప్రతిష్టంభన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 18: ఎట్టకేలకు రాజ్యసభలో ప్రతిష్టంభన తొలగిపోయింది. చైర్మన్ హమీద్ అన్సారీ శుక్రవారం నిర్వహించిన అఖిల పక్ష సమావేశంలో ఈ శీతాకాల సమావేశాలలో మిగిలిన మూడు రోజులు సభను సజావుగా సాగనివ్వడంతో పాటు ఏకాభిప్రాయం ఉన్న కొన్ని బిల్లుల ఆమోదానికి మద్దతివ్వడానికి ప్రతిపక్షం అంగీకరించింది. అయితే వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లుపై మాత్రం అధికార, ప్రతిపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. సుమారు గంట సేపు సాగిన చర్చల అనంతరం చైర్మన్ అన్సారీ మాట్లాడుతూ సమావేశం బాగా జరిగిందని అన్నారు. ఎస్‌సి, ఎస్‌టి (అత్యాచారాల నిరోధక) సవరణ బిల్లు, అప్రాప్రియేషన్ బిల్లులు, హైజాకింగ్ వ్యతిరేక బిల్లు, అణుశక్తి సవరణ బిల్లు, వాణిజ్య కోర్టుల ఆర్డినెన్స్ బిల్లు, ఆర్బిట్రేషన్ అండ్ కన్సిలియేషన్ అమెండ్‌మెంట్ బిల్లులను ప్రస్తుత సమావేశాలు ముగిసే 23వ తేదీలోగా ఆమోదించడానికి వివిధ పార్టీలకు చెందిన సభ్యులు నిర్ణయించారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇదివరలో బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బిఎసి) సమావేశంలో చర్చించిన అంశాలకు మించి కొత్త అంశాలను వేటినీ ఈ సమావేశంలో చర్చంచలేదని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్ చెప్పారు. అప్రాప్రియేషన్ బిల్లు సహా ఎస్‌సి, ఎస్‌టి బిల్లు వంటి కొన్ని బిల్లులకు మద్దతు తెలపడానికి తమ పార్టీ కట్టుబడి ఉందని ఆయన ఒక ప్రశ్నకు సమాధానంగా తెలిపారు. ‘జిఎస్‌టి బిల్లుపై చర్చ జరగలేదు. సాధారణ ఏకాభిప్రాయం ఉన్న బిల్లులపైనే చర్చ జరిగింది. జిఎస్‌టి బిల్లుపై ఏకాభిప్రాయం లేదని ప్రతి ఒక్కరికీ తెలుసు. కాంగ్రెస్‌కే కాకుండా మరికొన్ని పార్టీలకు ఈ బిల్లుపై అభ్యంతరాలు ఉన్నాయి’ అని ఆజాద్, జిఎస్‌టిపై ఏమైనా నిర్ణయం తీసుకున్నారా? అనే ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. జిఎస్‌టి బిల్లును లోక్‌సభ ఇదివరకే ఆమోదించింది. అయితే 2016 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి జిఎస్‌టిని అమలు చేయాలంటే ఈ బిల్లును ఈ నెల 23వ తేదీలోగా రాజ్యసభ ఆమోదించి, తరువాత రాష్ట్రాలకు పంపించాల్సి ఉంటుంది.
అయితే అఖిలపక్ష సమావేశంలో చాలా అర్థవంతమైన రీతిలో చర్చ జరిగిందని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నక్వీ చెప్పారు. పార్లమెంటు పనిచేయకపోవడంపై అనేక పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయని చెప్పారు. సభ సజావుగా సాగాలని, పెండింగ్‌లో ఉన్న ప్రభుత్వ బిల్లులను ఆమోదించాలని అందరూ నిర్ణయించారని ఆయన తెలిపారు.
chitram...
అఖిలపక్ష సమావేశం అనంతరం బయటకు వస్తున్న రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ఆజాద్ తదితరులు