జాతీయ వార్తలు

రెండేళ్లలో 2 లక్షలకుపైగా గృహాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: గత రెండేళ్ల కాలంలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ పట్టణ నవీకరణ కార్యక్రమం (జెఎన్‌ఎన్‌యుఆర్‌ఎం), రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధానమంత్రి ఆవాస యోజన-అర్బన్‌లాంటి పథకాల కింద రెండు లక్షలకు పైగా గృహాలు నిర్మించినట్లు ప్రభుత్వం బుధవారం లోక్‌సభకు తెలియజేసింది. రెండేళ్ల కాలంలో ఈ పథకాలను అమలు చేస్తున్న ఏజన్సీలు కింద 2,23,814 గృహాలు నిర్మించాయని కేంద్ర పట్టణాభివృద్ధి, దారిద్య నిర్మూలన శాఖ సహాయ మంత్రి రావు ఇందర్ సింగ్ లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయంలో చెప్పారు.
గృహ నిర్మాణం, పట్టణీకరణ అంశాలు రాష్ట్రాల పరిధిలోకి వస్తాయని ఆయన చెప్తూ, మురికివాడల్లో నివసించే వారితో సహా పట్టణ పేదలకు తక్కువ వ్యయంతో గృహాలు, వాటికి సంబంధించిన పౌర సదుపాయాలు కల్పించడానికి జెఎన్‌ఎన్‌యుఎం, రాజీవ్ ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన-అర్బన్ లాంటి పథకాలను అమలు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌సహా వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు అర్బన్ స్థానిక సంస్థలు, హౌసింగ్ బోర్డులు లాంటి తమ ఏజన్సీల ద్వారా ఈ పథకాలను అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు. జెఎన్‌ఎన్‌యుఎం, రాజీవ్ ఆవాస్ యోజన పథకాల కింద 13,86,761 గృహాలు మంజూరు చేయగా, వీటిలో ఇప్పటివరకు 10,60,899 గృహాలు పూర్తయ్యాయి. అలాగే ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్, 2015 జూన్ 25న ప్రారంభించిన హౌసింగ్ ఫర్ ఆల్ (అందరికీ గృహవసతి) పథకం కింద పట్టణ ప్రాంత పేదలకోసం 8,54,386 ఇళ్లు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు.