జాతీయ వార్తలు

దొంగలకు ముందస్తు సమాచారం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 10: సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో మంగళవారం సినీ ఫక్కీలో జరిగిన రైలు దోపిడీ వెనుక ఎవరున్నారనే దానిపై దర్యాప్తు అధికారులు కూపీ లాగుతున్నారు. 5.8 కోట్ల రూపాయల దోపిడీ వెనుక బ్యాంకు, రైల్వే సిబ్బంది హస్తం ఉండవచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఓ వ్యాగన్‌లో పాత కరెన్సీని ఆర్‌బిఐ తరలిస్తున్న సమయంలో ఈ దోపిడీ జరిగింది. ఇందుకు సంబంధించి బుధవారం రైల్వే అధికారులు కీలక వివరాలు సేకరించారు. సేలం-చెన్నై ఎక్స్‌ప్రెస్‌కు తగిలించిన ఈ క్యాష్ వ్యాగన్‌లోకి ఈరోడ్‌లోనే ఆరుగురు ప్రవేశించినట్లుగా తెలుస్తోంది. ఈ నగదును లోడ్ చేసిన ఏజన్సీ సిబ్బందిని, బ్యాంక్ అధికారులను కూడా దర్యాప్తు వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఈ వ్యాగన్‌లో దాదాపు 342 కోట్ల విలువైన పాత, చినిగిపోయిన కరెన్సీ నోట్లున్నాయి. ఈ వ్యాగన్‌లో ఓ వైపునుంచి రంధ్రం చేసుకుని మరీ దోపిడీదారులు ప్రవేశించినట్లుగా దానికున్న రక్తపు మరకలను బట్టి స్పష్టమవుతోంది. ఈ రంద్రం ద్వారా వ్యాగన్‌లోకి చొరబడేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు ఓ దోపిడీదారు గాయపడి ఉంటాడని, అందుకే ఈ రక్తపుమరకలుఏర్పడి ఉంటాయని చెబుతున్నారు.
దోపిడీకి గురయిన మొత్తం కరెన్సీ బరువు వంద కిలోలకు పైనే ఉంటుందని, నలుగురు లేదా ఆరుగురు ఈ దోపిడీకి పాల్పడి ఉండవచ్చని, పైగా దొంగిలించిన నగదు సురక్షిత ప్రాంతాలకు చేర్చేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసుకుని ఉండవచ్చని చెబుతున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతానికి సమీపంలోనే గోనె సంచులతో ఒక వ్యాన్ కూడా సిద్ధంగా ఉండినట్లు స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఈ ప్రత్యేక వ్యాగన్‌లో సేలంనుంచి చెన్నైకి నగదు తరలిస్తున్నారనే సమాచారం దోపిడీదారులకు ముందే అంది ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అంతేకాదు, ఈరోడ్‌లోనే ఈ వ్యాగన్ పైకప్పుకు కన్నం పెట్టి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. చదరపు ఆకారంలో మూడు వైపుల మాత్రమే ఈ రంధ్రం చేసి ఉంటారని, నాలుగో భాగాన్ని మూసివేసి లోపలికి ప్రవేశించే వీలుగా మార్చుకుని ఉంటారని చెబుతున్నారు.
ఈ రైలు సేలంనుంచి విరుదాచలం స్టేషన్ చేరుకునే సమయంలోనే దోపిడీ దొంగలు వ్యాగన్‌పైకి ఎక్కి ఉంటారని, అందుకు కారణం ఈ రెండు కిలోమీటర్ల దూరం అదిగమించడానికి అరగంట సమయం పట్టడమేనని అంటున్నారు. ఆ రంధ్రంనుంచే వ్యాగన్‌లోకి ప్రవేశించి నగదును గోనెసంచుల్లో కుక్కి రైలు వేగం పెరిగేలోగానే బైట ఉన్న వ్యక్తులకు అందేలా ఆ సంచులను విసిరేసి ఉంటారని చెబుతున్నారు. మరో రాష్ట్రానికి చెందిన దోపిడీ దొంగలే ఈ దోపిడీకి పాల్పడినప్పటికీ వారికి కచ్చితంగా ముందస్తు సమాచారం అంది ఉంటుందని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు.
దీనివెనుక మావోయిస్టుల హస్తం ఉండి ఉండవచ్చన్న అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ దోపిడీపై 8 ప్రత్యేక బృందాలు దర్యాప్తు సాగిస్తున్నాయి.

రైలు రూఫు పైనుంచి కన్నం పెట్టిన దొంగలు