జాతీయ వార్తలు

మనోధైర్యం నడిపించింది.. యోగ నిలబెట్టింది!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంఫాల్, ఆగస్టు 10: ఒకటి కాదు... రెండు కాదు... ఏకంగా పదహారు సంవత్సరాలు! ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఎవరైనా ఎంతకాలం జీవించగలరు? మరి... మణిపూర్ ఐరన్ లేడీ ఇరోమ్ షర్మిల ఎలా జీవించగలిగింది? పదహారు సంవత్సరాల పాటు ద్రవాహారానికే పరిమితం కావడం, తనంతతానుగా ఎలాంటి ఆహారం తీసుకోకుండా శక్తిని ఎలా కూడతీసుకోగలిగిందనేది ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే ఈ శక్తి వెనుక అంచనాలకు అందని మనోధైర్యం ఆమె సొంతం. దీంతోపాటు నిత్యం యోగ చేయడం కూడా నిరాహారం వల్ల ఎలాంటి శారీరక ఇబ్బందులు ఎదురుకాలేదు. ఈ విషయానే్న ఇరోం కుటుంబ సభ్యులు, సన్నిహితులు స్పష్టం చేస్తున్నారు. నిరాహారదీక్ష చేపట్టడానికి రెండేళ్ల ముందు అంటే 1998లో ఆమె యోగ నేర్చుకుందని వారు తెలిపారు. దృఢమైన మనోనిబ్బరం, క్రమం తప్పకుండా యోగాసనాలే శారీరకంగా ఆమె దృఢంగా ఉండటానికి దోహదం చేశాయని ఆమె సోదరుడు సింఘాజిత్ వెల్లడించారు. యుక్త వయసులో ప్రకృతివైద్యం అభ్యసించేందుకు మొగ్గుచూపిందని, అందులో భాగంగానే యోగ కూడా నేర్చుకుందని చెప్పాడు. అప్పట్లో ఆమె తీసుకున్న నిర్ణయం దీక్షా సమయంలో ఎంతగానో ఉపకరించిందని సింఘాజిత్ తెలిపాడు. తన జీవిత చరిత్ర ‘బర్నింగ్ బ్రైట్’ రాస్తున్న దీప్తిప్రియా మల్హోత్రాకు యోగ గురించి ఇరోం మాట్లాడుతూ, ‘యోగ అంటే ఫుట్‌బాల్ ఆట కాదు. అది చాలా ప్రత్యేకమైంది. యోగను అలవర్చుకున్న వ్యక్తి జీవితకాలం పరిపూర్ణంగా ఉంటుంది. వందేళ్లపాటు జీవించవచ్చు’ అని చెప్పింది. 1998-99ల్లో యోగాసనాలు వేయడం ప్రారంభించానని, అప్పటినుంచి యోగాను అలవాటు చేసుకున్నట్లు ఇరోం పేర్కొంది. నిరాహారంతో ఆత్మహత్యా యత్నం చేయడం చట్టప్రకారం శిక్షార్హమైన నేరం కావడంతో వైద్యులు బలవంతంగా ద్రవాహారం అందిస్తున్న విషయం విదితమే. ఉడికించిన అన్నం, పప్పు, కూరగాయలతో తయారుచేసిన ద్రవాహారాన్ని ఆమె ముక్కుకు అమర్చిన గొట్టం ద్వారా అందజేసే ఏర్పాటుచేశారు. దీక్ష విరమించేవరకూ ఆ గొట్టం ముక్కుకు అమర్చే ఉంది. ఇరోమ్ అనగానే తొలుత మణిపూర్ గుర్తొచ్చినా, వెనువెంటనే ఆమె రూపంతో పాటు గొట్టం అమర్చిన ముక్కు కూడా మదిలో మెదులుతుంది. అత్యధిక కాలం పాటు దీక్ష చేసి ప్రపంచ రికార్డు సృష్టించిన ఇరోం షర్మిళ చిరకాల వాంఛ సైనిక దళాల చట్టాన్ని తొలగించడమే. ఆ దిశగా ఆమె సరికొత్త పోరాటానికి రాజకీయ వేదికను ఎంచుకోవడం విశేషం!