జాతీయ వార్తలు

దుర్భేద్యంగా ఎర్రకోట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 10: ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దాడులు పెట్రేగుతున్న నేపథ్యంలో జరగనున్న భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులకు అత్యంత విస్తృత స్థాయిలో భద్రత, రక్షణ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ వేడుకల జరిగే చారిత్రక ఎర్రకోట వద్ద కనీవినీ ఎరుగని రీతిలో ఈసారి భద్రతా చర్యలు చేపడుతున్నారు. అత్యంత జనసమ్మర్థంగా ఉన్న ప్రాంతాలపైనే ఉగ్రవాదులు దాడులు చేస్తున్న దృష్ట్యా ఎర్రకోట వద్ద నిఘాను తీవ్రం చేస్తున్నారు. జూలై నెలనుంచే ఎర్రకోట వద్ద తీసుకోవల్సిన భద్రతా చర్యలకు సంబంధించిన ప్రయత్నాలు మొదలయ్యాయని, ప్రతి చిన్న విషయాన్నీ క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఎప్పటికప్పడు అధికారులు పరిస్థితులను పర్యవేక్షిస్తున్నారని తెలుస్తోంది. ఎర్రకోట వద్ద ఏర్పాటు చేసే మూడు కంట్రోల్ రూముల్లో వందలాది సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే దాదాపు ఆరువేల మంది సిబ్బందిని భద్రతా విధులకు నియోగిస్తారు. ప్రధాని ప్రసంగించే ఈ కార్యక్రమానికి దేశ, విదేశీ ప్రతినిధులు, లక్షలాది మంది ప్రజలు హాజరవుతున్న దృష్ట్యా భద్రతాపరంగా లోపరహితమైన చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వెల్లడించారు. ముఖ్యంగా ప్రధాని జనంలోకి వెళ్లి వారిని కలుకునే ప్రయత్నం వంటివి గతంలోకూడా జరిగాయి కాబట్టి అలాంటి పరిస్థితిని ఏ విధంగా ఎదుర్కోవాలన్న దానిపైనా అధికారులు దృష్టి సారించారు. ప్రధాన మంత్రి ఎర్రకోటకు వచ్చే మార్గమంతా వందలాది సిసిటివి కెమెరాలు అమర్చుతారు. ఒక్క ఎర్రకోట పరిసరాలను పరిశీలించడానికి 200 సిసిటివి కెమెరాలు ఏర్పాటు చేస్తారు. అలాగే అత్యంత శక్తివంతమైన హెచ్‌డి కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం ద్వారా ఆ ప్రాంతంలోని ప్రతి ఒక్కరి కదలికపైనా దృష్టి పెడతారు. ఎన్‌ఎస్‌జి కమాండోలు, ఇంటిలిజెన్స్ అధికారులతో పాటు 5000 మంది ఢిల్లీ పోలీసులు, వెయ్యి మంది పారామిలటరీ సిబ్బందిని ఎర్రకోట వద్ద మోహరిస్తారు. డ్రోన్ తరహా దాడులు జరగకుండా నిరోధించేందుకు ప్రత్యేక పోలీసు బృందాలు పనిచేస్తాయి. ముఖ్యంగా ఎర్రకోట పరిసర ప్రాంతాల్లో ఉండే తొమ్మిదివేల మంది ప్రజలకు సంబంధించి వివరాలను కూడా అధికారులు సేకరించారు. ఈ విధంగా కొత్తగా ఎవరొచ్చారు అన్నదానిపై కూడా ప్రత్యేక దృష్టి సారించేందుకు అవకాశం ఉందని చెబుతున్నారు. ఎర్రకోటకు అభిముఖంగా ఉండే 650 బాల్కానీలు, 104 కిటికీలపై కూడా దృష్టి సారిస్తామని వెల్లడించారు. ఈ భవనాలు అన్నింటిలోనూ పారామిలటరీ దళాలను నియోగిస్తామని తెలిపారు. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న 3000 చెట్లను కూడా గుర్తించారు. అక్కడ ఎవరూ ఉండకుండా చూస్తారు.