ఆంధ్రప్రదేశ్‌

హైటెక్ బాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: వయసుకు, టెక్నాలజీకి సంబంధం లేదు... నేర్చుకోవాలన్న తపనకు వయసు ఆటంకం కాదు. సాంకేతిక పరిజ్ఞానానికి ఆయనొక చిరునామా. సీఎంగా కంటే సీఈఓగా పిలిపించుకోవడమే ఆయనకు ఇష్టం. అలాంటి వ్యక్తి పుష్కరాల వంటి భారీ ఈవెంటుకు సాంకేతిక సొబగులు అద్దారు. తానే స్వయంగా ఆపరేషనల్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌లో కూర్చుని పుష్కర ఏర్పాట్లు, లోటుపాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఆ విషయంలో తనకంటే వయసులో చిన్న అయినా, కిందిస్ధాయి అధికారి చెప్పే విషయాలు ఆసక్తిగా విద్యార్థిలా ఆలకిస్తున్నారు. ఆయనే ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.
అత్యంత ప్రతిష్టాత్మంగా తీసుకుని నిర్వహిస్తోన్న కృష్ణా పుష్కరాల విజయవంతం కోసం టెక్నాలజీని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటున్న ఏకైక రాష్ట్రంగా ఏపి రికార్డు సృష్టిస్తోంది. లక్షల మంది భక్తులు వస్తున్న నేపథ్యంలో వారి కోసం వందలకోట్లు పెట్టి చేసిన ఏర్పాట్లు ఏవిధంగా ఉన్నాయని తెలుసుకునేందుకు బాబు పూర్తిగా టెక్నాలజీపై ఆధారపడ్డారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియం ఎదురుగా ఉన్న భవనంలో దానికోసం కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటుచేశారు. లోపల 30 మంది టెక్నికల్ సిబ్బంది, బయట క్షేత్రస్థాయిలో మరో 170 మంది, మొత్తం 200 మంది సిబ్బంది ఈ సెంటర్‌కు పనిచేస్తున్నారు. ఒక సాధారణ మహిళా ఎస్‌ఐ ఈ సందర్భంగా తమ సెంటర్‌లో చేసిన ఏర్పాట్లు, అది పనిచేసే విధానం గురించి చెబుతుంటే మీడియా ప్రతినిధులతోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సాధారణ వ్యక్తిలా ఆసక్తి ప్రదర్శించారు.
సెంటర్‌లో ఏర్పాటుచేసిన వీడియో స్క్రీన్లకు రాష్ట్రంలోని అన్ని ఘాట్లనూ అనుసంధానం చేశారు. 18డ్రోన్లు ఏర్పాటు చేయడంతో వాటి ద్వారా ఏ ఘాటు వద్ద ఏమి జరుగుతుందోనన్న విషయాన్ని బాబు స్వయంగా చూసి తెలుసుకుంటున్నారు. రౌడీషీటర్ల కదలిక నుంచి ఘాట్ల వద్ద జరిగే కదలికలను ఎప్పటికప్పుడు డ్రోన్లు రికార్డు చేస్తున్న విధానాన్ని బాబు మీడియాకు ఘాట్ల వారీగా వెల్లడించారు. శనివారం ఆయన మీడియాకు సెంటర్ ఏర్పాటు లక్ష్యాన్ని స్వయంగా వివరించారు. ఫొటోగ్రాఫర్లు, కెమెరామెన్లకు స్వయంగా బాబు సలహా సూచనలిచ్చారు. సెంటర్‌లో కూర్చున్న బాబు.. పద్మావతి, పున్నమి, దుర్గ ఘాట్ల వద్ద ఏం జరుగుతుందో స్వయంగా వివరించారు. కెమెరాను ఎక్కడికి తీసుకువెళ్లాలో కూడా సాంకేతిక సిబ్బందికి సలహాలిచ్చారు. భక్తుల కోసం తాత్కాలికంగా ఏర్పాటుచేసిన మరుగుదొడ్ల స్థితిగతులను తెలుసుకునేందుకు అప్పటికప్పుడు స్మార్ట్ ఫోన్ ద్వారా ఫొటో తెప్పించారు. ఘాట్ల వద్ద లీకవుతున్న టైల్స్‌ను స్క్రీన్ ద్వారా గమనించిన బాబు, అక్కడి సూపర్‌వైజర్‌తో మాట్లాడించారు. సెంటర్‌లో తమ పనితీరు ఎప్పటికప్పుడు రికార్డవుతుండటంతో ఘాట్ల వద్ద పనిచేసే సూపర్‌వైజర్ స్థాయి అధికారులు అలర్టుగా కనిపిస్తున్నారు.
స్మార్ట్ఫోన్లు, ఐవిఆర్‌సీఎల్‌తోపాటు కైజర్ యాప్‌ను బాబు ప్రభుత్వం విస్తృతంగా వినియోగించుకుంటోంది. వాటిని సెంటర్‌లోని 16 స్క్రీన్లకు అనుసంధానం చేశారు. యాప్‌ల ద్వారా ఏర్పాట్ల లోటుపాట్లతోపాటు, సిబ్బంది ఎక్కడెక్కడ పనిచేస్తున్నారన్న విషయం కూడా తెలుసుకునే విధానం అమలుచేస్తున్నారు. ఈ సెంటర్‌లో బాబు దాదాపు రెండుగంటలపాటు ఉండి, టెకీ అవతారమెత్తారు. ఇంకా ఏమైనా మెరుగైన సూచనలివ్వాలని కోరగా, మీడియా ప్రతినిధులు కూడా కొన్ని సూచనలివ్వడంతో వాటిని తక్షణం అమలుచేయాలని ఆదేశించారు.
సాంకేతిక పరిజ్ఞానం వినియోగించుకుంటే ఇంకా అద్భుతాలు సృష్టించ వచ్చని, అందుకే తాను పుష్కరాలకు ఈ విధానం అమలు చేస్తున్నామన్నారు. వందల కోట్లు పెట్టి వెచ్చిస్తున్న పుష్కరాల ఏర్పాట్లను పరిశీలించేందుకు మనుషులు పెద్ద సంఖ్యలో అవసరం ఉంటుంది. అయితే సాంకేతిక పరిజ్ఞాన సాయంతో పెద్దగా మనుషులు లేకుండానే ఏర్పాట్లు పర్యవేక్షించే పద్ధతి భవిష్యత్తులో రాష్ట్రానికి మేలు చేస్తుందని బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. ‘ఎవరికైనా టెక్నాలజీ మేలు చేస్తుంది. నాకు ఆ నమ్మకం ఉంది. భవిష్యత్తులో ఎక్కవమంది పోలీసులు లేకుండానే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయవచ్చు. డ్రోన్లను ఎక్కవగా వినియోగించుకోవాలి. మీరు కూడా అప్‌డేట్ అవండి. టెక్నాలజీని వినియోగించుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చు’ అని బాబు వ్యాఖ్యానించారు.

చిత్రం... కమాండ్ కంట్రోల్ రూములో స్మార్ట్ స్క్రీన్ల ఏర్పాట్లపై విలేఖరులకు వివరిస్తున్న చంద్రబాబు