జాతీయ వార్తలు

మీరూ ఊరుకోవద్దు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 13: రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ కూతురు శర్మిష్ట ముఖర్జీ తనకు ఫేస్‌బుక్ మెసెంజర్ ద్వారా అసభ్య సందేశాలు పంపిస్తున్న ఓ వ్యక్తి గుట్టును బట్టబయలు చేశారు. అత్యంత నీచమైన అశ్లీలమైన సందేశాలు పంపిస్తున్న పార్థామండల్ అనే వ్యక్తికి సంబంధించిన ఫేస్‌బుక్ ప్రొఫైల్, అతను పంపించిన సందేశాలను తన టైమ్‌లైన్‌లో ఉంచేసి అతని గుట్టు రట్టు చేశారు. ‘ఇలాంటి విపరీత బుద్ధులు కలిగిన వ్యక్తులను కచ్చితంగా ప్రజల ముందుంచి పరాభవించాలి’ అని షర్మిష్ట పేర్కొన్నారు. ‘‘పార్థామండల్ అనే ఓ వ్యక్తి నాకు హేయమైన లైంగిక సందేశాలు పంపిస్తున్నాడు. ముందుగా నేను వాటిని పట్టించుకోలేదు. అతణ్ణి బ్లాక్ చేద్దామని అనుకున్నాను. కానీ తరువాత అనిపించిందేమంటే ఇలాంటి వ్యక్తులను వదిలేస్తే మరికొందరిని ప్రోత్సహించినట్లవుతుంది అందుకే ఇతడి గురించి ప్రజలందరికీ తెలియజేయాలి. అతణ్ణి పరాభవించాలి. అందుకే అతను పంపించిన సందేశాల స్క్రీన్‌షాట్‌లను, ప్రొఫైల్‌ను బట్టబయలు చేస్తున్నా.. అతణ్ణి కూడా టాగ్ చేస్తున్నా. దీన్ని షేర్ చేయాలని అందరినీ కోరుతున్నా. ఇలాంటి విపరీత చర్యలను తేలిగ్గా తీసుకోరాదని కోరుతున్నా’’ అని శర్మిష్ఠ పేర్కొన్నారు.