అంతర్జాతీయం

నిబంధనలు పాటించలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, ఆగస్టు 13: ప్రముఖ సరోద్ వాద్యకారుడు ఉస్తాద్ అంజాద్ ఆలీఖాన్ వీసా తిరస్కరణపై బ్రిటన్ హోమ్ మంత్రిత్వశాఖ స్పందించింది. లండన్‌లో జరిగే ఓ సంగీత సమ్మేళనానికి హాజరయ్యే నిమిత్తం 70ఏళ్ల ఉస్తాద్ ఆలీఖాన్ వీసాకోసం దరఖాస్తుచేసుకున్నారు. వీసా దరఖాస్తును బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ అధికారులు తిరస్కరించడంతో ఆయన షాక్‌కు గురయ్యారు. అయితే బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ నిబంధనల ప్రకారం ఆయన దరఖాస్తు పూరించలేదని హోమ్‌శాఖ వెల్లడించింది. ‘వీసా దరఖాస్తులన్నీ క్షుణ్ణంగా పరిశీలించడం జరుగుతుంది. ఆయా వ్యక్తులకు సంబంధించి ప్రతిభాపాటవాలనూ పరిగణలోకి తీసుకుంటారు. దీనికి సంబంధించి దరఖాస్తుదారుడు బ్రిటన్ ఇమ్మిగ్రేషన్ నియమావళి ప్రకారం అవసరమైన ధ్రువీకరణ పత్రాలన్నీ అందజేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే పరిశీలించగా ఉస్తాద్ ఆలీఖాన్ దరఖాస్తు సంపూర్ణంగా లేనట్టు తేలింది. అందుకే తరస్కరించాల్సి వచ్చింది’ అని హోమ్‌శాఖ ప్రతినిధి స్పష్టం చేశారు. ఇంతకుమించిన వివరాలు అందించేందుకు ఆయన నిరాకరించారు. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో సౌత్‌బ్యాంక్ సెంటర్‌లో జరిగే దర్బార్ సంగీత సమ్మేళనంలో ఆలీఖాన్ పాల్గొనాల్సి ఉంది. వీసా దరఖాస్తు తిరస్కృతిపై లేబర్ పార్టీ సీనియర్ ఎంపీ కైత్‌వాజ్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హోమ్‌శాఖ దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా ఆమె డిమాండ్ చేశారు. సౌత్‌బ్యాంక్ సెంటర్ అధికార ప్రతినిధి మాట్లాడుతూ ‘ఉస్తాద్ ఆలీఖాన్ వీసా దరఖాస్తు తిరస్కరించడం దురదృష్టకరం. ఇటీవల వీసా నిబంధనలు మారినందునే అలా జరిగి ఉంటుందని భావిస్తున్నాం. ఈ విషయాన్ని ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి దాన్ని చక్కదిద్దుతాం’ అని స్పష్టం చేశారు. వీసా సమస్య పరిష్కరమై ఖాన్ పర్యటన సజావుగా సాగేందుకు రాయల్ ఫెస్టివల్ హాల్ నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.