జాతీయ వార్తలు

అరవై ఏళ్ల పాలనలో దేశానికి ఏం చేశారు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కకోరీ (యూపీ), ఆగస్టు 13: స్వాతంత్య్రం వచ్చాక సుదీర్ఘకాలం అధికారం చెలాయించిన కాంగ్రెస్ దేశాభివృద్ధిని పట్టించుకోలేదని బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా విరుచుకుపడ్డారు. అరవై ఏళ్ల కుటుంబ పాలనలో అభివృద్ధి ఊసేలేదని ఆయన ఆరోపించారు. బిజెపి ప్రభుత్వంలోనే అభివృద్ధి చెందుతోందని ఆయన చెప్పారు. ‘అరవై ఏళ్లు అధికారంలో ఉన్న నెహ్రూ-గాంధీ కుటుంబం అభివృద్ధిపై దృష్టిపెట్టలేదు. దేశం అన్ని రంగాల్లోనూ వెనకబడిపోవడానికి కాంగ్రెస్ పాలనే కారణం’ అని షా విమర్శించారు. శనివారం ఇక్కడ ‘యాద్ కరో ఖుర్బానీ’ కార్యక్రమంలో మాట్లాడిన బిజెపి అధ్యక్షుడు కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అభివృద్ధి బిజెపితోనే సాధ్యమని ఆయన ఉద్ఘాటించారు. అలాగే రాష్ట్రంలోని ఎస్‌పి, బిఎస్పీలపై ఆయన దాడికి దిగారు. ఈ రెండు పార్టీలకు అధికారం అప్పగిస్తే యూపీ అభివృద్ధిని చేయగలవా? అని ఆయన ప్రశించారు. సొంత ప్రయోజనాలే తప్ప ప్రజల బాగోగులు రెండు పార్టీలకు పట్టదని ఆయన ధ్వజమెత్తారు. అంతేకాదు ఒక వర్గం ప్రజల కోసమే ఎస్‌పి, బిఎస్పీలు పనిచేస్తాయని అమిత్ షా ఆరోపించారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బిజెపికి అధికారం అప్పగిస్తే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేస్తామని బిజెపి నేత భరోసా ఇచ్చారు. ఉత్తరప్రదేశ్ అభివృద్ధి చెందకపోతే దేశం ముందుకెళ్లదని ఆయన స్పష్టం చేశారు. బ్రిటిష్ ప్రభుత్వం నుంచి భారత్‌కు స్వేచ్ఛను ప్రసాదించిన సమరయోధుల సేవలను ఆయన శ్లాఘించారు. 1925 ఆగస్టు 9న కకోరీలో బ్రిటిష్ ప్రభుత్వం ఖజానాను ప్రజలు కొల్లగొట్టారని, ఆనాడు వారు చూపిన ధైర్యసాహసాలను బిజెపి అధినేత గుర్తుచేశారు. సమరయోధులు ఏ ఆశయం కోసం పోరాడారో అది సాధించలేకపోవడం విచారకరమని ఆయన అన్నారు. ‘స్వాతంత్య్రం వచ్చి ఇనే్నళ్లయినా గ్రామాలకు విద్యుత్ సదుపాయం లేదు. యువతకు ఉపాధి లేదు. భూములకు నీటి సదుపాయం లేదు. లక్షలాది మందికి వైద్య సదుపాయం అందడం లేదు’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తిరంగా యాత్రలో పాల్గొన్న బిజెపి అధ్యక్షుడు అమిత్ షా