జాతీయ వార్తలు

విచ్ఛిన్న ధోరణులతో చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 14:దళితులు, మైనార్టీలపై జరుగుతున్న దాడుల్ని కఠినంగా అణచివేయాలని రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం జాతినుద్దేశించి మాట్లాడిన రాష్టప్రతి విచ్ఛిన్నకర, విషపూరిత ధోరణుల్ని ఎండగట్టారు. ప్రజాస్వామ్యమంటే నిర్ణీత కాల వ్యవధిలో ప్రభుత్వాలను ఎన్నుకోవడం మాత్రమే కాదన్న వాస్తవాన్ని విస్మరించకూడదన్నారు. విచ్ఛిన్నకర ధోరణుల్ని రగిలిస్తూ సమాజంలో చీలికలు తెస్తున్న వారిపై తీవ్ర స్వరంతో విరుచుకు పడ్డారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తూ..వ్యవస్థాగతంగా పటుత్వాన్ని కనబరచాలన్నారు. తమ విధుల నిర్వహణలో అధికారులు, అధికారిక వ్యవస్ధలు తరతరాల భారత సాంప్రదాయక మర్యాదను పరిరక్షించాలన్నారు. రాష్టప్రతి పదవిని చేపట్టిన తర్వాత జాతినుద్దేశించి ప్రణబ్ ప్రసంగించడం ఇది ఐదోసారి. గత నాలుగు సంవత్సరాల కాలంలో విచ్ఛినకర, అసహన శక్తులు రెచ్చిపోవడాన్ని గమనించానన్నారు. జాతీయ మర్యాద, సంప్రదాయాలకు విరుద్ధంగా బలహీన వర్గాలపై జరుగుతున్న దాడుల్ని పెఢ ధోరణులుగా పేర్కొన్న ప్రణబ్ వాటిని కఠినంగా అణచివేయాలని ఉద్ఘాటించారు. ఇలాంటి శక్తుల్ని తరిమికొట్టడంలో భారత సమాజ పరిపక్వత, విజ్ఞత, రాజకీయ వ్యవస్థ ఉమ్మడిగా కృతకృత్యం కాగలవన్న విశ్వాసం, నమ్మకం తనకు ఉన్నాయన్నారు. స్వేచ్ఛా వృక్షాన్ని శాఖోపశాఖలుగా విస్తరింపజేయాల్సిన బాధ్యత ప్రజాస్వామ్యంలో ప్రధాన భాగంగా ఉన్న సంస్థలదేనని రాష్టప్రతి ఉద్ఘాటించారు. భారతీయ సంప్రదాయంలో అవిభాజ్య భాగం గా ఉన్న మర్యాదను మంటగలుపకూడదన్నా రు. దీన్ని కాపాడాల్సిన బాధ్యత అధికారిక వ్యవస్థ, పాలకులదేనని ఉద్ఘాటించారు. యావద్భారతం అభివృద్ధి చెందితేనే భారత వృద్ధి సాధ్యమవుతుందని, దానికి సమగ్రత చేకూరుతుందని హితబోధ చేశారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వాములను చేయాలని, ఇప్పటి వరకూ దూరంగా ఉండిపోయిన వారిని ఈ ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలని కోరారు. ఎన్ని సమస్యలు, సవాళ్లు ఎదురైనా అనాధిగా వస్తున్న భారతీయ జీవన స్ఫూర్తి చెక్కుచెదరదన్న దృఢ విశ్వాసం తనకు ఉందన్నారు. చరిత్రలో ఎన్నో శక్తులు ఈ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు ప్రయత్నించినా అది మరింత దేదీప్యమైందే తప్ప అణగారిపోలేదన్నారు.
దేశ యువతలో శాస్ర్తియ దృక్పథాన్ని పెం పొందించాల్సిన అవసరం ఎంతో ఉందని రాష్టప్రతి తెలిపారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎట్టి పరిస్థితుల్లోనూ వెనుకబడి పోవడానికి వీల్లేదని, ఇందుకు అవసరమైన ప్రతిభా సంపత్తులను సంతరించుకోవాలని తెలిపారు. శాంతియుత సహజీవనమే భారత దేశ విదేశాంగ విధానమని పేర్కొన్న రాష్టప్రతి ఆర్థిక అభివృద్ధి కోసం టెక్నాలజీ, వనరులను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇటీవల ప్రభుత్వాలు చేపట్టిన చర్యల వల్ల ఇంధన భద్రత, ఆహార భద్రత చేకూరాయన్నారు. పొరుగే ప్రథమం అన్న విధానంపై వెనక్కి వెళ్లే ప్రసక్తి లేదన్నారు. చరిత్ర, సంస్కృతి, నాగరికత, భౌగోళిక సామిప్యత దక్షిణాసియా దేశాల మధ్య బలమైన అనుబంధాన్ని పాదుగొలిపాయన్నారు.
70ఏళ్ల క్రితం భారత్‌కు స్వాతంత్య్రం వచ్చినప్పుడు ప్రజాస్వామ్య దేశంగా భారత్ నిలబడ గలుగుతుందా అన్న అనుమానం ప్రతి ఒక్కరికీ వచ్చిందని..ఏడు దశాబ్దాల తర్వాత 125కోట్ల జనాభా నాటి అంచనాలు అర్ధరహితమని రుజువు చేసిందన్నారు. న్యాయం, స్వేచ్ఛ,సమానత, సౌభ్రాతృత్వం ప్రాతిపదికగా భారత ప్రజాస్వామ్య నిర్మితమైందని చెప్పారు. అంతర్గతంగా, బాహ్యంగా ఎదురైన అన్ని సవాళ్లను అధిగమించి ఎపటికప్పుడు కొత్త శక్తిని సంతరించుకుంటూ వస్తోందని రాష్టప్రతి తెలిపారు. భిన్న రాజకీయ సిద్ధాంతాలు, విధానాలు ఉన్నప్పటికీ అధికార, విపక్షాలు అభివృద్ధి, సమైక్యత, సమగ్రత, జాతీయ భద్రత విషయంలో చేతులు కలిపాయని గుర్తు చేశారు. జిఎస్‌టి బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం ఇందుకు ప్రబల నిదర్శనమని చెప్పారు.
ఇటీవలి కాలంలో భారత వృద్ధి రేటు కూడా గణనీయంగా పెరిగిందని పేర్కొన్న రాష్టప్రతి భారత్‌ను అత్యంత వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా అంతర్జాతీయ ఏజెన్సీలు పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాగే స్టార్టప్‌ల ఉద్యమం, యువతలో సృజన అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించిందని చెప్పారు. సకాలంలో వచ్చిన వర్షాలూ ఆశాభావ పరిస్థితుల్ని కల్పించాయని, గత రెండు సంవత్సరాల వ్యవసాయ సంక్షోభానికి భిన్నంగా రైతాంగంలో ఆనందం వెల్లి విరుస్తోందని రాష్టప్రతి పేర్కొన్నారు. కరవుకాటకాలున్నా..ద్రవ్యోల్బణం ఆరుశాతానికి దిగువన ఉండటం భారత ఆర్ధిక వ్యవస్ధ అంతర్గత పుష్ఠికి నిదర్శనమని చెప్పారు.

70వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆదివారం
జాతినుద్దేశించి ప్రసంగిస్తున్న రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ