జాతీయ వార్తలు

నిర్భయ కేసులో.. కుర్ర నేరస్థుడి విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: తీవ్రస్థాయి నిరసనలు, వ్యతిరేక నినాదాల మధ్య నిర్భయ కేసులో బాల నేరస్థుడు ఆదివారం విడుదలయ్యాడు. విడుదల చేసిన వెంటనే ఆ నేరస్థుడ్ని ఓ ఎన్‌జిఓ సంస్థకు అప్పగించి గుర్తు తెలియని ప్రదేశానికి తరలించారు. ఈ నేరస్థుడి విడుదలను నిరోధించేందుకు శనివారం అర్థరాత్రి వరకూ జరిగిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఉత్తర ప్రదేశ్‌లోని తన సొంత గ్రామానికి వెళ్లడం కంటే ఎన్‌జిఓ సంస్థ వద్దకే వెళతానని రెండు రోజుల క్రితం బాల నేరస్థుడు స్పష్టం చేశాడని, అందుకే భద్రతాపరమైన అవసరాల దృష్ట్యా అతడ్ని ఎన్‌జిఓ సంస్థకే అప్పగించామని పోలీసు వర్గాలు తెలిపాయి. ఈ నేరస్థుడి విడుదల వ్యవహారం దేశ వ్యాప్తంగా తీవ్రస్థాయి ఆందోళనలకు దారితీయడంతో..చివరి ప్రయత్నంగా ఢిల్లీ మహిళా సంఘం సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శనివారం అర్థరాత్రి తర్వాత సమావేశమైన సుప్రీం కోర్టు ఈ నేరగాడి విడుదలపై స్టే ఇవ్వలేమని తేల్చిచెప్పింది. అయితే ఈ అంశాన్ని సోమవారం సెలవుకాలపు బెంచి విచారిస్తుందని తెలిపింది. ఇందుకు సంబంధించి ఢిల్లీ మహిళా కమిషన్ దాఖలు చేసిన ప్రత్యేక అనుమతి అప్పీలును సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకూర్ ఈ బెంచికి నివేదించారు. ఈ నేరస్థుడ్ని విడుదల చేయాలని నిర్ణయం తీసుకునే ముందు అతడి మానసిక స్థితిగతుల్ని నిర్థారించుకోలేదని ఢిల్లీ మహిళా కమిషన్ చైర్మన్ స్వాతీ మాలివాల్, ఇతర న్యాయవాదులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. నిర్భంధంలో ఉన్నప్పుడు కూడా ఈ నేరస్థుడిలో ఎలాంటి పశ్చాత్తాపం కనిపించలేదని, మరింతగా బలితెగించినట్టుగా ఇంటెలిజెన్స్ నివేదికల్ని బట్టి స్పష్టమైనందని న్యాయవాది దేవదత్ కామత్ తెలిపారు. దీన్ని బట్టి చూస్తే ఈ బాలనేరస్థుడు విడుదలైన తర్వాత సమాజానికి ప్రమాదకరం కాడని చెప్పలేమన్నారు.

చిత్రం.. నిర్భయ కేసులో కుర్ర నేరస్థుడి విడుదలను నిరసిస్తూ ఢిల్లీలో ప్రదర్శనలకు దిగిన ఎబివిపి