జాతీయ వార్తలు

డిడిసిఎ వ్యవహారంపై దర్యాప్తు కమిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20:్ఢల్లీ క్రికెట్ బోర్డులో పెద్ద ఎత్తున అక్రమాలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలను నిగ్గు దేల్చేందుకు మాజీ సొలిసిటర్ జనరల్ గోపాల్ సుబ్రమణ్యం సారథ్యంలో దర్యాప్తు కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించింది. పదమూడు సంవత్సరాల పాటు డిడిసిఎ అధ్యక్షుడిగా పని చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ హయాంలలోనే ఈ అవకతవకలు జరిగాయంటూ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపించిన నేపథ్యంలో దర్యాప్తు కమిషన్ ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని జైట్లీతో పాటు పలువురు బిజెపి నేతలూ కొట్టి పాడేశారు. అయితే, త్వరలోనే ఈ వ్యవహారంపై దర్యాప్తు మొదలు అవుతుందని, వాస్తవాలన్నీ అప్పుడే బయటికి వస్తాయని ఢిల్లీ ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు. ఈ దర్యాప్తుకు సారథ్యం వహించడానికి గోపాల్ సుబ్రమణ్యం అంగీకరించారని ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వెల్లడించారు. డిడిసిఎ అక్రమాలకు సంబంధించిన ఫైళ్లను చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతోనే ఇటీవల కేజ్రీవాల్ ప్రిన్సిపల్ కార్యదర్శి కార్యాలయంపై సిబిఐ దాడి జరిగిందని ఆప్ నేతలు ఆరోపణలు గుప్పించారు.