జాతీయ వార్తలు

ఎఎన్-32 శకలాలు కనిపించాయా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఆగస్టు 21: చెన్నై నుంచి పోర్టు బ్లెయిర్ వెళుతూండగా కొన్ని వారాల క్రితం 29 మందితో గల్లంతైన ఐఎఎఫ్ విమానం ఎఎన్-32 శకలాలు కనిపించాయా? సముద్ర పరిశోధనలు జరిపే ఆర్‌వి సముద్ర రత్నాకర్ గాలింపులో ఈ శకలాలు కనిపించాయి. లక్షా 45వేల చదరపు కిలోమీటర్ల పరిధి కలిగిన ఈ ప్రాంతంలో ఇప్పటి వరకూ 4500 చదరపు కిలోమీటర్ల ప్రాంతాన్ని ఈ నౌక గాలించింది. ఈ పరిధిలోనే మొత్తం 14 విడిభాగాలు కనిపించాయని చెబుతున్నప్పటికీ అవి కచ్చితంగా ఎఎన్-32 విమానానివేనా అన్నది స్పష్టం కావడం లేదు. నౌక గుర్తించిన ఈ భాగాలు శిలలకు సంబంధించినవైనా కావచ్చు లేదా సముద్రంలో తేలియాడుతున్న మెరుపులాంటి భాగాలైనా కావచ్చునని జిఎస్‌ఐ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ ఎస్.రాజు వెల్లడించారు. ఈ భాగాలన్నీ కూడా 3వేల మీటర్ల లోతులోనే ఉన్నట్టుగా తమ నౌక గుర్తించిందన్నారు. కనిపించిన శకలాలు గల్లంతైన విమానానివా కాదా అనే విషయాన్ని నిర్థారించడానికి ఈ ప్రాంతాన్ని మరోసారి సర్వే చేయాల్సిన అవసరం ఉందని నౌకలోని నిపుణులు చెబుతున్నారు. తీర రక్షక దళాలు, అలాగే వైమానిక దళ అధికారులు కూడా శకలాల గుర్తింపు వార్తను ధృవీకరించలేదు.