జాతీయ వార్తలు

చత్తీస్‌గఢ్‌లో పేలిన మందుపాతర

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చింతూరు, ఆగస్టు 21: ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా ఎర్రబోరు వద్ద ఆదివారం మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి, సిఆర్‌పిఎఫ్ హెడ్‌కానిస్టేబుల్ ఒకరు తీవ్రంగా గాయపడ్డారు. ఎర్రబోరు పోలీసుస్టేషన్ సమీపంలో ఆదివారం వారాంతపు సంత వద్ద భద్రత కోసం సిఆర్‌పిఎఫ్ సిబ్బందిని నియమించారు. మార్కెట్ వద్ద విధులు నిర్వర్తిస్తున్న సిఆర్‌పిఎఫ్ 212 బెటాలియన్ హెడ్‌కానిస్టేబుల్ దిలీప్‌కుమార్ బోరో పొరపాటున మావోయిస్టులు పెట్టిన ప్రెషర్ బాంబుపై కాలువేయడంతో ఒక్కసారిగా పేలింది. దీంతో తీవ్రంగా గాయపడిన దిలీప్‌కుమార్‌ను సమీపంలోని ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎర్రబోరు సమీప అటవీ ప్రాంతంలో కూంబింగ్ ముమ్మరం చేశాయి. ఈ సమయంలో మావోయిస్టులు తారస పడటంతో ఇరువర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతిచెందాడు. సంఘటనాస్థలంలో ఒక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదిలావుండగా రాజ్‌నంద్‌గావ్ జిల్లా కొండాగావ్ పోలీసుస్టేషన్ పరిధిలోని అంతాగర్ వద్ద మావోయిస్టులు అమర్చిన రెండు ఐఇడి బాంబులను పోలీసులు గుర్తించి నిర్వీర్యం చేశారు.

మందు పాతర పేలి గాయపడిన హెడ్ కానిస్టేబుల్ * ఎదురుకాల్పుల్లో మృతిచెందిన మావోయిస్టు