జాతీయ వార్తలు

హోదాపై పొంతన లేని మాటలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై తెదేపా చేస్తున్న ప్రచారం వెనుక మోదీని మళ్లీ ప్రధాని కాకుండా జరుగుతున్న కుట్ర ఉందా? మిగిలిన రాష్ట్రాల్లో కూడా హోదా ఉద్యమాలకు ఊపిరిపోసే వ్యూహం ఉందా? ఒక వేళ హోదా ఇస్తే ఎంతమేరకు నిధులు వస్తాయన్న దానిపై పొంతన లేని లెక్కలు చెబుతున్న తెదేపా నాయకత్వం, తెలంగాణ మాదిరిగా హోదాను సెంటిమెంటుగా మార్చే రాజకీయ ఎత్తుగడలో ఉందా?..అన్న ప్రశ్నలకు బిజెపి నాయకత్వం అవుననే సమాధానం ఇస్తోంది. ఎన్డీఏ సర్కారుపై పరోక్షంగా చేస్తున్న ఈ కుట్రను అడ్డుకుని జనంలోకి తీసుకువెళతామంటున్నారు.
ప్రత్యేక హోదాపై తెదేపా చేస్తున్న ప్రచార వ్యూహంపై బిజెపిలో విశే్లషణ మొదలయింది. అసలు హోదాపై తెదేపా నాయకత్వానికి సరైన అవగాహన లేదని, అయినా సరే ఆ అంశాన్ని తెలంగాణ మాదిరిగా సెంటిమెంటుగా మార్చి మోదీని అప్రతిష్ఠపాలు చేసే రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోందన్న అనుమానం బిజెపిలో వ్యక్తమవుతోంది. దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని నిర్ణయించింది.
హోదా వల్ల ఏడాదికి ఎంత వస్తుందన్న దానిపై సరైన అధ్యయనం చేయకుండానే, తమకు వ్యతిరేకంగా ప్రచారం చేయడాన్ని బిజెపి జీర్ణించుకోలేకపోతోంది. హోదా వస్తే ఏడాదికి 2500 కోట్లు వస్తాయని కేంద్రమంత్రి సుజనాచౌదరి, 3500 కోట్లు వస్తాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తాజాగా చెప్పిన విషయాన్ని బిజెపి నేతలు ప్రస్తావిస్తున్నారు. ఇదే బాబు అసెంబ్లీలో హోదా వస్తే 6వేల కోట్లు వస్తాయని చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ఏదో ఒకటి మాట్లాడి జనంలో సెంటిమెంటును పోగేయాలన్న రాజకీయ ఎత్తుగడే తప్ప, వాస్తవాలు చెప్పడం లేదని బిజెపి నేతలు విమర్శిస్తున్నారు.
నిజానికి 2013-14లో కాంగ్రెస్ హయాంలో మొత్తం ప్రణాళిక వ్యయం రు.453.327 కోట్లు. ఇందులో కేంద్ర ప్రణాళిక కోసం కేటాయించింది 3, 40, 479 కోట్లు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రణాళిక వ్యయాల కోసం కేటాయించింది కేవలం 112849 కోట్లు. ఇందులో కేవలం 25642.27 కోట్లు మాత్రమే సాదారణ ప్రణాళిక సహాయంగా ఇచ్చారు. ఇందులో 30 శాతం.. అంటే 7692.68 కోట్ల రూపాయలను ప్రత్యేక హోదా ఉన్న 11 రాష్ట్రాలకు పంపిణీ చేశారు. ఆ ప్రకారంగా ఒక్కో రాష్ట్రానికి దక్కింది 700 కోట్లని బిజెపి నేతలు గుర్తుచేస్తున్నారు.
కేంద్రం ఇప్పుడు దానికంటే ఎక్కువ నిధులు ఇస్తున్నా ఆ విషయాన్ని చెప్పటం లేదన్నారు. చంద్రబాబునాయుడు హోదా కింద 6 వేల కోట్లు వస్తాయని శాసనమండలిలో లెక్క చెప్పినప్పుడు, బిజెపి సభ్యుడు సోము వీర్రాజు స్పందించి మీ లెక్కలు నిజమనుకున్నా రాష్ట్రానికి ఇప్పటికే 60 వేల కోట్లు ఇచ్చింది కదా? విభజనలో లేనివి కూడా కేంద్రం ఇచ్చింది కదా అని గతంలోనే ప్రశ్నించిన వైనాన్ని పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు.
‘హోదా విషయంలో తెదేపా నాయకత్వం వ్యూహాత్మకంగా మోదీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తోంది. అసలు హోదా వస్తే రాష్ట్రానికి ఎంత వస్తాయన్నది అంచనా వేయకుండా, నివేదికలు తెప్పించుకోకుండా బట్టకాల్చి మోదీపై బట్టకాల్చే రాజకీయ ఎత్తుగడకు పాల్పడుతోంద’ని బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేష్‌రెడ్డి స్పష్టం చేశారు.
ఇటీవల చైనాకు వెళ్లి వచ్చిన బాబు బృందానికి అక్కడి జియాన్ రాష్ట్ర ఆవిర్భావం, రాజధాని నగర ఏర్పాటు నేపథ్యం కనిపించలేదా? అని ప్రశ్నించారు. ‘చైనాలో జియాన్ రాష్ట్రం కొత్తగా ఏర్పాటయింది. దానికి చైనా ప్రభుత్వం ఇచ్చిన నిధులు కేవలం 10 వేల కోట్ల రూపాయలే. జియాన్ ఒక్కరోజులో ఏర్పడింది కాదు. 15 ఏళ్లలో అభివృద్ధి చెందింది. బాబు బృందం చైనా వెళ్లి మరి ఏమి గ్రహించింది?’అని ప్రశ్నించారు. అమరావతిని హైదరాబాద్‌తో పోల్చడం కూడా ప్రచారంలో భాగమేనన్నారు. హైదరాబాద్ కూడా ఒక్క రాత్రిలోనే, రెండేళ్లలోనే అభివృద్ధి జరిగింది కాదని స్పష్టం చేశారు.