జాతీయ వార్తలు

సెక్స్ కోరిక తీర్చడమూ లంచమే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 21: పార్లమెంటరీ కమిటీ ప్రతిపాదించిన ఒక కొత్త చట్టం ప్రకారం లంచం అంటే ఒక డబ్బే కాదు, సెక్స్ కోరిక తీర్చమని కోరడం కూడా లంచం కిందికే వస్తుంది. అంతేకాదు కొత్త చట్టం కింద ఆ నేరానికి శిక్ష కూడా ఉంటుంది. రాజ్యసభ సెలెక్ట్ కమిటీ ప్రభుత్వం తాజాగా ప్రతిపాదించిన అవినీతి నిరోధక చట్టంపై సమర్పించిన నివేదికలో లా కమిషన్ నివేదికకు ఆమోదం తెలపడమే కాకుండా సెక్స్ కోరిక తీర్చడంతో సహా వేరే ఏ రూపంలోనైనా సంతృప్తి పరచడాన్ని కూడా లంచంగా పరిగణించడానికి సంబంధిత చట్టంలో ‘మితిమీరిన ప్రయోజనం’(అన్‌డ్యూ అడ్వాంటేజ్) అనే ఒక క్లాజును చేర్చాలని సిఫార్సు చేసింది. మొట్టమొదటి సారిగా కార్పొరేట్ సంస్థలు, వాటి ఎగ్జిక్యూటివ్‌లను కూడా ప్రతిపాదిత అవినీతి నిరోధక చట్టం పరిధిలోకి తీసుకు రావడం ద్వారా ప్రైవేట్ రంగంలో లంచాలు తీసుకోవడాన్ని కూడా నేరంగా పరిగణించాలని, అందుకు జరిమానాతో పాటుగా ఏడేళ్ల దాకా జైలుశిక్ష విధించాలని ఈ పార్లమెంటు స్థారుూ సంఘం సిఫార్సు చేసింది. అంతేకాకుండా లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇచ్చే వారికి కూడా శిక్షలు ఉండాలని కూడా స్థారుూ సంఘం సూచించింది.
1988 నాటి అవినీతి నిరోధక చట్టంకింద లంచాలు తీసుకోవడం నేరం అవుతుంది. అయితే లంచం నిర్వచనాన్ని విస్తరించడానికి, ప్రైవేటు రంగంలో లంచగొండితనాన్ని సైతం దీని పరిధిలోకి తీసుకు రావడానికి గాను ప్రభుత్వం అవినీతి నిరోధక (సవరణ) బిల్లు-2013 ప్రతిపాదించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఈ బిల్లు పెండింగ్‌లో ఉంది.
లంచాలకు సంబంధించిన నేరాలకు సంబంధించి బిల్లులో ‘ఆర్థిక పరమైన లేదా ఇతర ప్రయోజనం’గా నిర్వచించారు. అయితే చట్టపరంగా తీసుకునే జీతభత్యాలు కాకుండా ఇచ్చే ఏ రకమైన ముడుపులనైనా శిక్షార్హమైనవిగా చేయడం కోసం ఈ పదం స్థానంలో ‘మితిమీరిన ప్రయోజనం’ అనే పదాన్ని చేరుస్తూ గత ఏడాది నవంబర్‌లో ఈ బిల్లుకు కొన్ని అధికారిక సవరణలు చేర్చారు. రాజ్యసభకు చెందిన సెలెక్ట్ కమిటీ ఈ బిల్లును పరిశీలించి ఇటీవలే తన నివేదికను సమర్పించింది. బిల్లులో ప్రతిపాదించిన సవరణల్లో ‘అన్‌డ్యూ అడ్వాంటేజ్’ అనే పదం చేర్చడం వల్ల ఆర్థికపరమైన, ఆర్థికేతరమైన అన్ని రకాల ముడుపులు లంచం కిందికి వస్తాయని, అయితే చట్టాలను అమలు చేసే సంస్థలు దీన్ని దుర్వినియోగం చేసేందుకు కూడా అవకాశముందని కమిటీకి చెందిన సభ్యులు అభిప్రాయా పడ్డారని, అందువల్ల దీనికి సంబంధించి అన్ని ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని కమిటీ తన నివేదికలో సూచించింది.