జాతీయ వార్తలు

సంపన్న దేశాల్లో భారత్‌కు ఏడోస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 23: ప్రపంచంలో పది సంపన్న దేశాల్లో భారత్ చోటు సంపాదించుకుంది. భారత్‌లో 5,600 బిలియన్ డాలర్ల సంపద ఉన్నట్లు ఓ సర్వేలో వెల్లడైంది.
ఈ జాబితాలో అమెరికా 48,900 బిలియన్ డాలర్ల సంపదతో మొదటి స్థానంలో ఉంది. రెండోస్థానంలో చైనా (17,400 బిలియన్ డాలర్లు), జపాన్ మూడోస్థానంలో (15,100 బిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఇక నాలుగో స్థానంలో యునైటెడ్ కింగ్‌డమ్ (9200 బిలియన్లు) జర్మనీ అయిదో స్థానంలో (9100 బిలియన్ డాలర్లు) ఫ్రాన్స్ ఆరోస్థానంలో (6600 బిలియన్ డాలర్లు) ఏడోస్థానంలో భారత్ (5600 బిలియన్ డాలర్లు), ఎనిమిదో స్థానంలో కెనడా (4700 బిలియన్ డాలర్లు), తొమ్మిదో స్థానంలో ఆస్ట్రేలియా (4500బిలియన్ డాలర్లు) పదోస్థానంలో ఇటలీ (4400 బిలియన్ డాలర్లు) ఉన్నాయి.
ఒక వ్యక్తి ఆస్తులు, వ్యాపార ప్రయోజనాలు, ఈక్విటీల ఆధారంగా సంపదను లెక్కించారు. భారత్‌లో ఎక్కువ జనాభా ఉన్నందునే ఈ ర్యాంకింగ్‌లో చోటు దక్కిందని నివేదికలో పేర్కొన్నారు. 22మిలియన్ల మంది జనాభా ఉన్న ఆస్ట్రేలియా ఆర్థిక వృద్ధి బాగుందని పేర్కొన్నారు. గత అయిదేళ్లలో చైనా వేగంగా అభివృద్ధి చెందింది. భారత్, ఆస్ట్రేలియా, కెనడాల్లో కూడా వృద్ధిరేటు బాగా ఉందని నివేదిక పేర్కొంది.