జాతీయ వార్తలు

భారత్, రష్యా అణు సహకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: భారత ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం నుంచి రష్యాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య జరిగే చర్చల్లో అణు ఇంధన సహకారం సహా అనేక కీలక ఒప్పందాలు కుదిరే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా కుళంకుళంకు సంబంధించి రెండు దేశాలు ఓ ఒడంబడికపై సంతకం చేయవచ్చునని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దేశంలో ఇంధన అవసరాలు రోజురోజుకు పెరుగుతున్నందున ఈ కొరత తీర్చేందుకు ప్రధాని రష్యా పర్యటనను గరిష్టస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే ప్రస్తుతం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న అణు కేంద్రాలను పరిశీలించి మరిన్ని అణు రియాక్టర్లను ఏర్పాటుచేసేందుకు ఓ ప్రణాళికను ప్రభుత్వం రూపొందిస్తోంది. ఈ నెల 23-24 తేదీల్లో జరిపే రష్యా పర్యటనలో భాగంగా ఆ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో మోదీ శిఖరాగ్ర భేటీ జరుపుతారు. ప్రతి ఏటా ఇరు దేశాల మధ్య ఈ రకమైన శిఖరాగ్ర చర్చలు జరుగుతాయి.