జాతీయ వార్తలు

2019లో అధికారమే లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 24: 2019 ఎన్నికల్లో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ అన్నారు. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి అస్సాం స్ఫూర్తిగా తీసుకొని పనిచేస్తామని ఆయన స్పష్టం చేశారు. మంగళవారం నాడు జరిగిన వివిధ రాష్ట్రాల కోర్ కమిటి సభ్యులకు బూత్ స్థాయి నుండి పార్టీ బలోపేతంపై అధిష్ఠానం తమకు మార్గనిర్దేశం చేసిందని వెల్లడించారు. బుధవారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్భ్రావృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం సంక్షేమ పథకాలు చివరి స్థాయికి తీసుకెళ్ళే విధంగా పనిచేస్తామన్నారు. ఎన్డీయే ప్రభుత్వం నుంచి ఆశించిన విధంగా సాయం అందడం లేదని టిఆర్‌ఎస్ నాయకులు చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదన్నారు. మొదటి సారి రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీ సమక్షంలోనే కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలుగా సహాయం అందిస్తుందని, కేంద్ర ప్రభుత్వం పథకాలకు పెద్ద ఎత్తున నిధులు మంజూరు చేస్తుందని ముఖ్యమంత్రి కెసిఆర్ బహిరంగానే ప్రకటన చేసారని ఆయన గుర్తు చేశారు. కేంద్రం నుంచి అందుతున్న నిధులు కింది స్థాయి వర్గాలకు చేరడం లేదని, నిధులు దారి మళ్లింపు జరుగుతోందని ఆయన విమర్శించారు. సెప్టెంబర్ 17న నిర్వహించనున్న తెలంగాణ విమోచన దినోత్సవానికి బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా హాజరవుతారని తెలిపారు.
44వ జాతీయ రహదారి ప్రాంతంలో కర్నూలు, హైదరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్‌ను కలుపుతూ పరిశ్రామిక కారిడార్‌గా ఏర్పాటు చేయలని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు విజ్ఞప్తి చేసినట్లు లక్ష్మణ్ తెలిపారు. అదేవిధంగా కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో సీట్ల సంఖ్యను పెంచాలని, పది, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని కేంద్రమంత్రి ప్రకాశ్ జవడేకర్ కు వినతిపత్రాన్ని అందించినట్లు చేప్పారు. అలాగే తెలంగాణకు ఐఐఎం ఏర్పాటుకు చొరవ తీసుకోవాలని కేంద్ర మంత్రిని విజ్ఞప్తి చేశామన్నారు.
మహారాష్టత్రో నీటి ఒప్పందాలు ఏకపక్షం
తెలంగాణ ప్రభుత్వం మహారాష్టత్రో నీటి ప్రాజక్టుల నిర్మాణంపై ఒప్పందం ఏకపక్షంగా కుదుర్చుకుందని లక్ష్మణ్ మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వ షరతులకు లొంగి తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని ఆయన ఆరోపించారు. తాజా నీటి ఒప్పందం మూలంగా ఎటువంటి ప్రయోజనం లేదని, మల్లన్న సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి లేని అభ్యంతరం కాంతనపల్లికి ఎందుకని లక్ష్మణ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వం వైఫల్యాలను కప్పిపుచుకోవటానికే చారిత్మ్రాక ఒప్పందం అని ప్రచారం చేసుకొంటున్నారని ఆయన దుయ్యబట్టారు.