జాతీయ వార్తలు

డిప్యుటేషన్ కోసం పేర్లు పంపండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: కేంద్రం లో మహిళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల కొరత ఉం ది. అందువల్ల ఈ వర్గాలకు చెందిన ఐఏఎస్, ఐపిఎస్ అధికారులను డిప్యుటేషన్‌పై కేంద్రానికి పంపించాలని కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు అన్ని రాష్ట్రాలను కోరింది. ఒకవేళ కేంద్రానికి డిప్యుటేషన్‌పై పంపించాలని నామినేట్ చేసి, తరువాత ఆ నామినేషన్‌ను వెనక్కి తీసుకుంటే సంబంధిత ఐఏఎస్, ఐపిఎస్ అధికారులు తరువాత అయిదేళ్ల పాటు సెంట్రల్ డిప్యుటేషన్ అవకాశాన్ని, విదేశాలలో పోస్టింగ్ పొందే అవకాశాన్ని కోల్పోతారని కూడా కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తుచేసింది. ‘సెంట్రల్ స్ట్ఫాంగ్ స్కీమ్ (సిఎస్‌ఎస్) కింద కేంద్రంలో మహిళ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారులకు తగినంత మందికి చోటు కల్పించాల్సి ఉంది. అందువల్ల తగినంత మంది మహి ళా, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఐఏఎస్, ఐపిఎస్ అధికారుల పేర్లను డిప్యుటేషన్ కోసం పంపించండి’ అని కేంద్ర సిబ్బంది, శిక్షణ వ్యవహారాల శాఖ అన్ని రాష్ట్రాలకు, క్యాడర్ కంట్రోలింగ్ అధికారులకు రాసిన లేఖలో ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వానికి ఎంతమంది అధికారులను డిప్యుటేషన్‌పై పంపించాలనే అంశా న్ని ప్రతి రాష్ట్ర క్యాడర్‌కు చెందిన సెంట్రల్ డిప్యుటేషన్ రిజర్వ్ (సిడిఆర్) నిర్ణయిస్తుంది. ‘సిడిఆర్ తక్కువగా ఉండటమే కా కుండా, అనేక రాష్ట్రాలు సిడిఆర్ నిష్పత్తిని చేరుకోవడంలో తీవ్రంగా విఫలమయ్యాయి’ అని కేంద్రం తన లేఖ లో పేర్కొంది. ఈ కొరతను అధిగమించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలను ఆదేశించింది. కేం ద్రంలో డిప్యూటి సెక్రెటరి, డైరెక్టర్ స్థాయిల్లో ఐఏఎస్ అధికారుల కొరత ఉందని, అందువల్ల ఈ పోస్టుల్లో నియమించడానికి అధికారులను నామినేట్ చేయాలని కేంద్ర సిబ్బంది వ్యవహారాల శాఖ రాష్ట్రాలను కోరిం ది. ‘రాష్ట్రాల స్థాయిలో సామర్థ్యాలను పెంచడానికి, భారత ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకునే స్థాయిలో జాతీయ దృక్పథాన్ని పెంపొందించేందుకు రాష్ట్రాల నుంచి అధికారులను కేంద్రానికి పంపించడం, తిరిగి వెనక్కి తీసుకోవడం ఎంతో కీలకమనే విషయాన్ని మీరు అంగీకరిస్తారు’ అని తన లేఖలో పేర్కొంది. అర్హతలు ఉన్న ప్రతి అధికారికి కేంద్రంలో కనీసం ఒకసారి మిడిల్ మేనేజ్‌మెంట్ స్థాయిలో పనిచేసే అవకాశం ఉందని, అందువల్ల తగిన అర్హతలు గల ఎక్కువ మంది అధికారుల పేర్లను నామినేట్ చేయాలని డిఓపిడి రాష్ట్రాలను కోరింది.