జాతీయ వార్తలు

పోలీసులు ప్రజలతో మమేకం కావాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాణ్ ఆఫ్ కచ్, డిసెంబర్ 20: ఐసిస్, ఇతర ఉగ్రవాద ముఠాలు యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడానికి ప్రయత్నించడంపై ఫ్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతున్న తరుణంలో సున్నితత్వం పోలీసింగ్‌లో కీలక అంశం కావాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంతేకాకుండా పోలీసులు స్థానికులతో సంబంధాలు నెలకొల్పుకునేలా, వారితో మరింత మమేకం అయ్యే విధంగా పోలీసు శాఖలో సంస్కరణలు తీసుకు రావాలని, దీనివల్ల పోలీసుల్లో ప్రజల పట్ల సున్నితత్వం నెలకొనేందుకు వీలవుతుందని ఆయన అన్నారు. గుజరాత్‌లోని రాణ్ ఆఫ్ కచ్‌లో మూడు రోజులుగా జరుగుతున్న డిజిపిల సమావేశం చివరి రోజయిన ఆదివారం ముగింపు కార్యక్రమంలో ప్రధాని ప్రసంగించారు.
పోలీసింగ్‌లో స్థానిక వర్గాలను విశ్వాసంలోకి తీసుకోవాలని, కేసుల పరిష్కారంలో ఆధునిక టెక్నాలజీని ఉపయోగించాలని దేశం నలుమూలలనుంచి హాజరయిన సుమారు వందమంది పోలీసు అధికారులతో ప్రధాని అన్నారు.‘ స్థానిక వర్గాలతో పోలీసు బలగాలు సన్నిహిత సంబంధాలను నెలకొల్పుకోవాలని, ప్రజలు సాధించిన విజయాలను స్థానిక కమ్యూనిటీల్లో జరుపుకోవడం దీనికో మార్గమని ఆయన అన్నారు. పోలీసుల సేవలను ప్రజలు, ప్రజల విజయాలను పోలీసులు గుర్తించినప్పుడే ఆదర్శవంతమైన సమాజం ఏర్పడుతుందని ఆయన చెప్పారు. ఇటీవల కొంతమంది యువకులు ఉగ్రవాద సంస్థ ఐఎస్‌ఐఎస్ ప్రభావానికి లోనయినప్పుడు ఆంధ్రప్రదేశ్, కర్నాటక, మహారాష్టల్రోని పోలీసులు వారి మనసు మార్చడానికి కుటుంబ సభ్యులను, మత పెద్దలకు ప్రమేయం కల్పించారని ఆయన చెప్పారు.
గడచిన మూడు రోజులుగా ఇక్కడ చర్చించిన అంశాలు, డిజిలు పరస్పరం పంచుకున్న అనుభవాలు తననెంతో ఆకట్టుకున్నాయని ప్రధాని చెప్పారు. పోలీసు యూనివర్సిటీలు, ఫోరెన్సిక్ యూనివర్సిటీల ఏర్పాటు గురించి కొందరు సూచిస్తే మరికొందరు సైబర్ సెక్యూరిటీ, సోషల్ మీడియా ద్వారా ప్రజా సేవ లాంటి అంశాల గురించి మాట్లాడారని ప్రధాని అంటూ, ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. దేశ సరిహద్దులు, రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండే పోలీసు స్టేషన్లు మరింత సంయమనం, సమన్వయంతో పని చేయాలని కోరారు. పోలీసు అధికారుల అంకిత భావం, నిస్వార్థ సేవలను మోదీ ప్రశంసిస్తూ దేశ భద్రతకు ఇది ఎంతో ముఖ్యమన్నారు. ఈ సందర్భంగా ప్రధాని అత్యుత్తమ సేవలందించిన ఇంటెలిజన్స్ బ్యూరో అధికారులకు రాష్టప్రతి పోలీసు పతకాలను అందజేసారు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఆ శాఖ సహాయ మంత్రులు కిరణ్ రిజిజు, హరిభాయ్ పార్థ్భియ్ చౌదరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

మిశ్రమ స్పందన

ౄ లోక్‌సభకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలపై
భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేసిన పార్టీలు

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: లోక్‌సభకు, దేశ వ్యాప్తంగా గల అన్ని రాష్ట్రాల శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలన్న పార్లమెంట్ స్థారుూసంఘం సిఫార్సుకు రాజకీయ పార్టీల నుంచి మిశ్రమ స్పందన వ్యక్తమయింది. ఎన్నికల నిర్వహణ వ్యయం తగ్గించడంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుకు, ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు తరచుగా వస్తున్న ఎన్నికల వల్ల ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఆటంకంగా మారుతున్నందున లోక్‌సభకు, రాష్ట్రాల విధానసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని చట్టం, సిబ్బంది వ్యవహారాలపై ఏర్పాటు చేసిన పార్లమెంట్ స్థారుూసంఘం తన నివేదికలో సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. ఈ నివేదికను ఈ వారం మొదట్లో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు. ఎఐఎడిఎంకె, ఎజిపి, ఐయుఎంఎల్, డిఎండికె, శిరోమణి అకాలీదళ్‌లు స్థారుూసంఘం భావనతో ఏకీభవించాయి. అయితే ఈ పార్టీలు కొన్ని సూచనలు కూడా చేశాయి. మరోవైపు, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్, సిపిఐ, ఎఐఎంఐఎం, ఎన్‌సిపి ఒకేసారి ఎన్నికల నిర్వహణను తిరస్కరించాయని స్థారుూసంఘం తన నివేదికలో వెల్లడించింది. ఒకేసారి ఎన్నికల నిర్వహణపై కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి సహా ఇతర పార్టీల వైఖరి ఏంటనేది స్థారుూసంఘం తన నివేదికలో పేర్కొనలేదు. స్థారుూసం ఘం ఆలోచనకు ఎఐఎడిఎంకె సూత్రప్రాయంగా మద్దతు తెలిపింది. ‘్భరత్‌లో ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం అంటే అర్థం తొలుత లోక్‌సభ, రాష్ట్రాల అసెంబ్లీలకు కలిపి నిర్దిష్టమైన అవధి (టర్మ్)ని నిర్ణయించడం. తరువాత వీటన్నింటికి కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం. అమెరికాలో అధ్యక్ష ఎన్నికలలో వలె ఒకేసారి ఓట్లు లెక్కించి, ఫలితాలను ప్రకటించాలి’ అని ఎఐఎడిఎంకె సూచించింది. ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం వల్ల చిన్న పార్టీలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, విధాన నిర్ణయాల స్తంభనకు, అభివృద్ధి కార్యక్రమాల అమలుకు ఆటంకంగా మారుతున్న ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉండే కాలం తగ్గుతుందని అసోం గణపరిషత్ అభిప్రాయపడింది.

జిఎస్‌టి బిల్లు లోపభూయిష్టం

కాంగ్రెస్ అభ్యంతరాలను పరిష్కరిస్తే బిల్లు ఆమోదం సాధ్యమే ౄ మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం

న్యూఢిల్లీ, డిసెంబర్ 20: ఎన్డీఏ ప్రభుత్వం తీసుకు వచ్చిన వస్తు సేవల పన్ను (జిఎస్‌టి) బిల్లు లోపభూయిష్టంగా ఉందని కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు పి. చిదంబరం అంటూ, కాంగ్రె స్ పార్టీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిష్కరించడం ద్వారా ప్రభు త్వం జిఎస్‌టి బిల్లును ఆమోదింపజేసుకోవచ్చని అన్నారు. ‘లోపభూయిష్టమైన బిల్లు కన్నా జిఎటి బిల్లు ఆలస్యం కావడమే మంచిదన్న ఆర్ధిక మంత్రి జైట్లీ మాటలతో నేను ఏకీభవిస్తున్నాను. ప్రస్తుత జిఎస్‌టి బిల్లు లోపభూయిష్టంగా ఉంది’ అని చిదంబరం ట్విట్టర్‌లో వ్యాఖ్యానించారు. గత వారం ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో జైట్లీ మాట్లాడుతూ, లోడభూయిష్టమైన జిఎస్‌టి బిల్లుకన్నా జిఎస్‌టి ఆలస్యం కావడమే మంచిదని అనడం తెలిసిందే. ఒక రాష్ట్రంనుంచి మరో రాష్ట్రం మధ్య సరకుల రవాణాపై ఒక శాతం అదనపు పన్ను విధించాలన్న నిబంధనను రద్దు చేయాలని చిదంబరం సూచించారు. ‘ఏ విధంగా చూసినా ఒక శాతం పన్ను మృతప్రాయమైంది. అందువల్ల ఈ నిబంధనను రద్దు చేయండి. కాంగ్రెస్ పార్టీ లేవనెత్తిన మూడు బలమైన అభ్యంతరాలను పరిష్కరించండి. అప్పుడు బిల్లు ఆమోదం పొందగలదు’ అని ఆయన తన ట్వీట్‌లో అన్నారు. కాంగ్రెస్ పార్టీ మూడు కారణాలపై వస్తు సేవల పన్నుపై ప్రస్తుత రాజ్యాంగ సవరణ బిల్లును వ్యతిరేకిస్తోంది. బిల్లులో జిఎస్‌టి రేటును నిర్దేశించాలన్నది పార్టీ డిమాండ్. అయితే పన్ను రేట్లను ‘రాతిలో మూసపోయడం’ సాధ్యం కాదని ప్రభుత్వం అం టోంది. నైపుణ్యంతో బిల్లు ముసాయిదాను రూపొందించడం ద్వారా బిల్లు లో రేటు పరిమితిని చేర్చవచ్చని చిదంబరం అంటున్నారు. కాగా, రాష్ట్రాల మధ్య వివాదాలను సుప్రీంకోర్టు పరిష్కరించే విధానం ఉండాలనికూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన వివాదాల పరిష్కార యంత్రాంగాన్ని ఏ రాష్టమ్రూ వ్యతిరేకించడం లేదని చిదంబరం ట్విట్టర్‌లో అంటూ, అందువల్ల అలాంటి వ్యవస్థను ఏర్పా టు చేయండని అన్నారు. జిఎస్‌టిపై ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోని యా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో భేటీ కావడం గురించి ప్రశ్నించగా, ‘ప్రభుత్వం సవరించిన రూపాలతో వస్తుందని వారు సోనియా, మన్మోహన్ సింగ్‌కు చెప్పినట్లు మాత్రమే నాకు తెలుసు. అయితే ఇప్పటిదాకా ఎలాంటి సవరించిన రూపాలు మాకు కనిపించలేదు. ఈ భేటీ జరిగి దాదాపు నెలరోజులైంది’ అని చిదంబరం అన్నారు.
జిఎస్‌టి అమలుకు ప్రభు త్వం పెట్టుకున్న 2016 ఏప్రిల్ గడువును వదులుకోవలసిందేనా అని అడ గ్గా, ‘ఆ గడువును ఎవరు విధించారో నాకు తెలియదు. అది ఏమా త్రం ఆచరణ సాధ్యమైన గడువు కాదు. ఎందుకంటే రాజ్యాంగ సవరణ బిల్లును పార్లమెంటు ఆమోదించిన తర్వాత ప్రతి రాష్ట్రం కూడా ఒక చట్టాన్ని ఆమోదించాల్సి ఉంటుంది’ అని చిదంబరం అన్నారు.