జాతీయ వార్తలు

మత ఘర్షణలే సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్యలలో మత ఘర్షణలు ఒకటని భారత్‌లోని యువత భావిస్తోంది. అవినీతి, పేదరికం తరువాత ప్రధానమైన సమస్య మత ఘర్షణలేనని యువత భావిస్తున్నట్లు తాజా సర్వే ఒకటి తెలిపింది. డబ్ల్యుఇఎఫ్‌కు చెందిన గ్లోబల్ షేపర్స్ వార్షిక సర్వే 2016 ప్రకారం సర్వేలో పాల్గొన్న వారిలో సుమారు 49.6 శాతం మంది ప్రభుత్వం జవాబుదారీగా లేకపోవడం, పారదర్శకంగా లేకపోవడం, అవినీతి వంటివి దేశాన్ని ప్రభావితం చేస్తున్న తీవ్రమైన సమస్యలని భావించారు. 39.7 శాతం మంది పేదరికం అత్యంత తీవ్రమైన సమస్య అని పేర్కొన్నారు. 32.7 శాతం మంది మత ఘర్షణలే అత్యంత తీవ్రమైన సమస్య అని అభిప్రాయపడ్డారు. కాగా, 31.1 శాతం మంది నిరక్షరాస్యత దేశాన్ని పీడిస్తున్న ప్రధాన సమస్య అని పేర్కొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా గల యువత ఆలోచనావిధానం, వారి ప్రాధాన్యతలు, ఆందోళనలపై ఈ గ్లోబల్ సర్వే అభిప్రాయాలను సేకరించింది. 181 దేశాల్లోని 26వేలకు పైగా మంది నుంచి అభిప్రాయాలను స్వీకరించింది.
ప్రపంచ స్థాయిలో వరుసగా రెండో సంవత్సరం యువత వాతావరణ మార్పును ప్రపంచాన్ని పీడిస్తున్న అత్యంత తీవ్రమైన సమస్యగా పరిగణించింది. దీని తరువాత విస్తృత స్థాయిలో జరుగుతున్న ఘర్షణలు, మత ఘర్షణలు, పేదరికం అంశాలను ప్రధానమైన సమస్యలుగా పేర్కొన్నారు. ప్రపంచ స్థాయిలో వారి వారి దేశాలలో ఈ సవాళ్లను ఎవరు విజయవంతంగా ఎదుర్కోగలరనే ప్రశ్నకు యువత స్థానిక సవాళ్లను పరిష్కరించడం ద్వారా అని 26 శాతం మంది, ప్రభుత్వాలు అని 20 శాతం మంది, పౌర సమాజం అని 17 శాతం మంది బదులిచ్చారు. ప్రపంచ సవాళ్లకు సంబంధించి అంతర్జాతీయ సంస్థలు పరిష్కరించగలవని 26 శాతం మంది, ఏ దేశానికి ఆ దేశం పరిష్కరించుకోగలదని 20 శాతం మంది అభిప్రాయపడ్డారు.
ప్రపంచంలో యువత సాంకేతిక పరిజ్ఞానం పట్ల ఆశావాద దృక్పథంతో ఉన్నట్లు ఈ సర్వే తెలిపింది. సాంకేతిక పరిజ్ఞానం కొన్ని ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తున్నప్పటికీ, చివరికి ఉద్యోగావకాశాల వృద్ధికి ఛోదకశక్తిగా నిలుస్తుందని 86 శాతం మంది అభిప్రాయపడ్డారు.