జాతీయ వార్తలు

‘తలాక్’పై కేంద్రానికి సుప్రీం నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 26: ముస్లిం సంప్రదాయంలో మూడు సార్లు ‘తలాక్’ చెప్పి విడాకులు తీసుకోవడంపై వివరణ ఇవ్వాలంటూ సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్రానికి నోటీసులు జారీ చేసింది. కోల్‌కతాకు చెందిన ఇషత్ జహాన్ అనే 26 ఏళ్ల మహిళ దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి టిఎస్ ఠాకుర్, న్యాయమూర్తులు ఎ ఎం ఖన్విల్కర్, డివై చంద్రచూడ్‌లతో కూడిన ధర్మాసనం కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఈ నోటీసులు జారీ చేసింది. దుబాయినుంచి తన భర్త ఫోన్లో మూడు సార్లు తలాక్ చెప్పి తననుంచి విడాకులు తీసేసుకున్నాడని, దీన్ని తాను వ్యతిరేకిస్తున్నానని పిటిషన్‌లో ఆ మహిళ ఆరోపించింది. ముస్లిం వివాహ చట్టం రాజ్యాంగం ప్రసాదించిన ప్రాథమిక హక్కులకు భంగకరమని, తన భర్త, అత్తమామలు తనను మొదటినుంచి ఇంటినుంచి గెంటేయడానికి ప్రయత్నిస్తున్నారని, తన నలుగురు పిల్లలను కూడా వారితో తీసుకెళ్లిపోయారని అడ్వకేట్ వికె బిజు ద్వారా దాఖలు చేసిన ఆ పిటిషన్‌లో ఆ మహిళ ఆరోపించింది. తలాక్‌ను వ్యతిరేకిస్తూ దాఖలయిన మరికొన్ని పిటిషన్‌లతో దీన్ని జత చేసిన బెంచ్ తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది.