జాతీయ వార్తలు

థెరిస్సాకు ఘన నివాళి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కోల్‌కతా, ఆగస్టు 26: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా 106వ జయంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లోని చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు జరుపుకొన్నారు. మిషనరీస్ ఆఫ్ చా రిటీ ఆధ్వర్యాన కృతజ్ఞనా కూడికలు జరిగాయి. రోమన్ కథోలిక్ సన్యాసిని, మనవతావాది దివంగ త థెరీసాకు వచ్చేనెల 4న వాటికన్ సిటీలో సెయింట్‌హుడ్ ప్రకటిస్తారు. దీన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ‘దేవుకునికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఆమెను కోల్‌కతాకు దే వుడు ఇచ్చిన వరం’అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న నంద న్ మల్టీఫ్లెక్స్‌లో మదర్ థెరీసా అంతర్జాతీ య ఫిలిం ఫెస్టివల్ ప్రారంభించారు. థెరీ సా జీవితం ఇతివృత్తంగా నిర్మించిన 23 విదేశీ, స్వదేశీ చిత్రాలు ఇక్కడ ప్రదర్శిసా తరు. మిషనరీస్ ఆఫ్ చారిటీ సుపీరియర్ జనరల్ ప్రేమ మాట్లాడుతూ విశ్వమానవ కల్యాణం కోసం థెరీసా చూపిన బాటలో నడవాలని పిలుపునిచ్చారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన ట్విట్టర్‌లో థెరీసాకు ఘనంగా నివాళులర్పించారు. వాటికన్‌లో జరిగే సెయంట్‌హుడ్ కార్యక్రమానికి మ మతా బెనర్జీ, కేంద్ర విదేశాంగ మంత్రి సు ష్మా స్వరాజ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.

చిత్రం... నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మదర్ థెరీసా 106 జయంతి సందర్భంగా శుక్రవారం కోల్‌కతాలో
ఆమె విగ్రహం వద్ద ప్రార్థనలు. క్రైస్తవ నన్‌లు జరిపిన ప్రార్థనల దృశ్యాన్ని సెల్‌ఫోన్ కెమెరా స్క్రీన్‌మీదా చూడొచ్చు