జాతీయ వార్తలు

ముసాయదా రెడీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే అంశంపై కేంద్రం ప్రభుత్వం త్వరలోనే ఒక ప్రకటన చేసే అవకాశాలున్నాయని టిడిపి పార్లమెంటరీ పార్టీ నేత, కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖా మంత్రి సుజనా చౌదరి వెల్లడించారు. బిజెపి అధ్యక్షుడు అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ, సమాచార శాఖ మంత్రి ఎం వెంకయ్యనాయుడు, సుజనా చౌదరి మంగళవారం ఇక్కడ సమావేశమయ్యారు. అమిత్‌షా నివాసంలో జరిగిన సమావేశంలో ఏపికి ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ, పోవలం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్ తదితర అంశాపై దాదాపు గంటనర పాటు చర్చించారు. సమావేశానంతరం మంత్రి సుజనా చౌదరి మీడియాతో మాట్లాడారు. కేంద్రం ఏపికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయం పరిశీలిస్తోందని చెప్పటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సహాయం, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, ప్రత్యేక రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయటంపై ఎదురవుతున్న సమస్యలపై దృష్టి సారించినట్లు ఆయన స్పష్టం చేశారు. ఏపికి ప్రత్యేక హోదా అంశంపై వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న రాజకీయాల అంశం కూడా చర్చకు వచ్చినట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం ఏపికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే రాజకీయంగా తమకు తీరని నష్టం కలుగుతుందని టిడిపి నాయకులు ఆందోళన చెందుతున్న విషయం తెలిసిందే. ప్రత్యేక హోదా అనేది ఆంధ్రులకు భావోద్వేగంతో కూడుకున్న అంశంగా మారిందనేది ఎన్‌డిఏ ప్రభుత్వం అర్థం చేసుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రత్యేక హోదాపై కేంద్ర ప్రభుత్వం ఒక ముసాయిదాను తయారు చేసిందనీ, న్యాయ నిపుణులతో చర్చించిన అనంతరం కేంద్రం ఓ ప్రకటన చేసే అవకాశం ఉందని సుజనా చౌదరి చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టంలో ఇచ్చిన హామీలను అమలు చేయటంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించిందని ఆయన చెప్పారు. ఇలా ఉంటే అమిత్ షా నివాసంలో సమావేశం ముగిసిన అనంతరం సుజనా చౌదరి కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రత్యేక హోదా, ప్రత్యేక ఆర్థిక సహయం తదితర అంశాల గురించి చర్చించారు.