జాతీయ వార్తలు

మూడో ప్రత్యామ్నాయ శక్తిగా పవన్ కళ్యాణ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పూర్తిస్థాయి రాజకీయాల్లోకి వస్తే మూడో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగే అవకాశముందని సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ అన్నారు. పవన్ కళ్యాణ్ చేతనైతే పూర్తిస్థాయిలో రాజకీయాల్లోకి రావాలనీ, లేనిపక్షంలో రజనీకాంత్‌లా ఇంట్లో కూర్చోవాలని ఆయనకు సలహా ఇచ్చారు. పవన్‌లో కమ్యూనిస్టు భావాలు బాగానే ఉన్నా, ఆయన నడకలో తడబడుతున్నారని నారాయణ వ్యాఖ్యానించారు. ఏపీలో అధికార, ప్రతిపక్షాలపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయ శక్తికి అవకాశాలు చాలా ఉన్నాయని ఆయన చెప్పారు. అవసరమైతే పవన్‌తో చర్చలకు తాము సిద్ధమేనన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఓ రాజకీయ అజ్ఞాని అని, జగన్‌ను సైతం పార్టీలో చేర్చుకుంటానడం అవివేకానికి నిదర్శనమని విమర్శించారు. అలాగే ఏపీ ప్రత్యేక హోదానే 2019 ఎన్నికలకు ప్రధాన ఎజెండాగా ఉంటుందని ఆయన అన్నారు.