జాతీయ వార్తలు

ప్రజాస్వామ్య విరుద్ధంగా అమరావతి ల్యాండ్‌పూలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఆగస్టు 30: అమరావతి నిర్మాణం కోసం మూడు పంటలు పండే భూములను ల్యాండ్‌పూలింగ్ పేరుతో ఏపి ప్రభుత్వం భూమిని సమీకరించిందని సామాజికవేత్త మేధాపట్కర్ ధ్యజమెత్తారు. ఢిల్లీలో మంగళవారం విలేఖరులతో మాట్లాడుతూ ప్రజాస్వామ్య విధానానికి విరుద్ధంగా ఏపీ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణాన్ని చేపడుతోందని ఆమె విమర్శించారు. భూసమీకరణ పేరుతో రైతులను ముఖ్యమంత్రి చంద్రబాబు భ్రమల్లో ఉంచి వారి భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చారని అవేదన వ్యక్తం చేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో రాజధాని నిర్మించడం వల్ల ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. కృష్ణా నదికి వరదలు వస్తే అమరావతి కొట్టుకుపోయే పరిస్థితి ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీలో ప్రారంభమైన ఈ ల్యాడ్‌పూలింగ్ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుసరిస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా రైతుల భుములను ప్రభుత్వాలు లాక్కుంటున్నాయని దుయ్యబట్టారు.